Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Saturday, 21 December 2024

Parent Teacher Meeting at MPPS Uppununthala Boys on 21/12/2024

 ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం (PTM): ఈ రోజు ఉదయం 9:30 గం.లకు ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం (PTM) ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ర్ అద్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆహారోత్సవం నిర్వహించి పోషక విలువల గురించి చర్చించడం జరిగింది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, చందన మేడం, సంగీత మేడం లు మాట్లాడుతూ పోషక విలువలు సమృద్ధిగా ఉన్న పాలు, పండ్లు, గుడ్లు, మాంసం, ఆకు కూరలు, కూరగాయలు, తృణ ధాన్యాలు లతో తయారు చేసిన...

Quiz Competition at MPPS Uppununthala Boys

 విద్యార్దులకు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులుగా పెన్నులు అందించి అభినందించడం జరిగిం...

Friday, 20 December 2024

Word Meditation Day Programme at MPPS Uppununthala Boys

ఘనంగా ప్రపంచ ధ్యాన దినోత్సవం:ఈ రోజు ఉదయం 9:30 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రపంచ ధ్యాన దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు ధ్యానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, మంచి అలవాట్లు అలవడుతాయని, మనస్సును అదుపులో...

Thursday, 5 December 2024

Babasaheb Dr.B.R Ambedkar's 68th Death Anniversary Programme

బాలుర ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులు: ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి అందరూ పూలతో నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు మాట్లాడుతూ అంబేద్కర్ గారు చిన్నతనం నుండి ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురైనా బాగా చదువుకుని కుల, లింగ వివక్షతలకు, బాల్య వివాహాలు, జోగిని వ్యవస్థ, అంటరానితనం, మూఢనమ్మకాలకు...

Tuesday, 29 October 2024

Felicitation and Welcome to Megavath Srinu sir on the occasion of joining in our school

🌹💐🌹📖✍️డిఎస్సీ 2024 ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంపికైన మెగావత్ శ్రీను సార్ మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో చేరిన సందర్భంగా శాలువాతో సన్మానించి, ఘనంగా స్వాగతం పలికి, హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు🌹💐🌹&nb...

Tuesday, 15 October 2024

Missile Man of the India Dr A.P.J Abdul Kalam's 93rd birth anniversary celebrations 2024 at MPPS Uppununthala Boys

ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 93 జయంతి కార్యక్రమం:ఈ రోజు మధ్యాహ్నం 3:30 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 93 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు వెంకటేష్ , చందన అబ్దుల్ కలాం గారు భారత దేశానికి చేసిన సేవలను గురించి విద్యార్థులకు వివరిస్తూ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో పేద కుటుంబంలో జన్మించిన అతను కష్టపడి చదువుకొన్నాడు....

Saturday, 21 September 2024

Parent Teacher Meeting for September 2024 at MPPS Uppununthala Boys

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సమావేశానికి ఆహ్వానించి, వారి పిల్లలు ఇంటి వద్ద ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని,...

Saturday, 17 August 2024

Parent Teacher Meeting at MPPS Uppununthala Boys for August 2024

 తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సమావేశానికి ఆహ్వానించి, వారి పిల్లలు ఇంటి వద్ద ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, ప్రతి...

Thursday, 15 August 2024

78th Independence Day Celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు!ప్రభాత భేరిలో జాతీయ నాయకుల వేశాధారణలో విద్యార్థులుఉదయం 6 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 78 స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ప్రభాత భేరితో ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు జాతీయ నాయకుల వేశాధారణ ధరించి వీధులన్నీ తిరుగుతూ భారతీయ వీరులం భరతమాత బిడ్డలం శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం అనీ పాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గొంతెత్తి నినదిస్తూ ఉప్పొంగిన ఆనందంతో దేశంపై గౌరవాన్ని చాటారు.జాతీయ జెండా ఎగురవేస్తున్న...

Tuesday, 6 August 2024

90th Birth Anniversary Celebrations of Prof Jayashankar sir

 ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి:ఈ రోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 90వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కాంప్లెక్స్ హెచ్. ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ పాల్గొన్నారు. ఎల్.ఎఫ్.ఎల్ హెచ్.ఎం బిచ్యా నాయక్ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, బాలమణి మేడం, చందన మేడం లు, ఆలూరి లింగమయ్య, జెర్మయ్య...

Farewell and Welcome Programme at MPPS Uppununthala Boys

 ఘనంగా ఆత్మీయ వీడ్కోలు & స్వాగతం కార్యక్రమం:ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఆత్మీయ వీడ్కోలు & స్వాగతం కార్యక్రమాన్ని హెచ్.ఎం శ్రీనివాసులు సార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి సార్, పెద్దలు కట్ట అనంత రెడ్డి సార్, పి.ఆర్.టి.యు రాష్ట్ర నాయకులు బిచ్యా నాయక్ సార్, ఎ.ఎ.పి.సి చైర్ పర్సన్ అరుణ లింగమయ్య గారు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి...

Saturday, 3 August 2024

Spelling Bee Competition at MPPS Uppununthala Boys

 స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహణ:ఈ రోజు మధ్యాహ్నం 3 గం.కు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మొదటి శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఐదు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన ఎదురిశెట్టి వరున్ తేజ్ గ్రూప్ విద్యార్థులు మొదటి బహుమతి మరియు ఆలూరి అక్షర గ్రూప్ విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందారు, వీరికి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ ఉపాధ్యాయులు...

Saturday, 20 July 2024

Parent Teacher Meeting has been conducted at MPPS Uppununthala Boys

 తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి తెలియజేస్తూ సహ పాఠ్య కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణ, అభివృద్ధి సంబంధించిన పనులలో, మీ వృత్తికి సంబంధించిన...

Thursday, 18 July 2024

Navodaya Classes Start at MPPS Uppununthala Boys

 బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నవోదయ తరగతులు ప్రారంభం:నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యిందని, పరీక్ష జనవరి 18, 2025 న నిర్వహిస్తారని, ప్రస్తుతం విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, నవోదయ తరగతులు ఈ రోజు నుండి మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రారంభించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం తెలియజేశారు. అదేవిధంగా మన పాఠశాలలో సైనిక్...

Friday, 12 July 2024

Teacher's Farewell and Welcome Programme at MPPS Uppununthala Boys

 ఘనంగా ఆత్మీయ వీడ్కోలు మరియు స్వాగతం కార్యక్రమం:ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఆత్మీయ వీడ్కోలు మరియు స్వాగతం కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి సార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ అరుణ గారు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి మరియు విద్యార్థులకు నాణ్యమైన విద్యను...

Saturday, 22 June 2024

School bags distributes by Mr. Maryada Rukma Reddy to MPPS Uppununthala Boys

 విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ!ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు ఇదే పాఠశాలలో చదివి అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి మర్యాద రుక్మా రెడ్డి గారు, తన సోదరుడు మర్యాద కృష్ణ రెడ్డి గారితో స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేయించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ, ఉపాధ్యాయులు బాలమణి, వెంకటేష్ మాట్లాడుతూ పాఠశాల సాధించిన ప్రగతిని, విద్యార్థులు సాధించిన గురుకుల సీట్ల వివరాలను, పాఠశాలలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అబాకస్,...

Thursday, 20 June 2024

International Yoga Day Celebrations 2024 at MPPS Uppununthala Boys

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం: ఈరోజు ఉదయం 9 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు బలమణి, శ్రీనివాసులు, వెంకటేష్ మాట్లాడుతూ యోగా గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015 సంవత్సరం నుండి జరుపుకుంటున్నారని తెలియజేశారు. యోగాసనాలు అంటే వ్యాయామంలో...

National Deworming Day at MPPS Uppununthala Boys

 జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం: ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పునుంతల వైద్య సిబ్బంది విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్ లను వేశారు. వారు మాట్లాడుతూ 2015 లో పిల్లలలో నులిపురుగుల ప్రివలెన్స్ రేట్- 60% నుండి 2023 లో పిల్లలలో నులిపురుగుల ప్రివలెన్స్ రేట్-01% కు తగ్గిందని,ఇంతటి ప్రగతి సాధించడం ఉపాధ్యాయుల సహాయ సహకారాల...

Sports Day Celebration at MPPS Uppununthala Boys

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు రోజు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహణ: బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులను జుట్లుగా చేసి కబడ్డీ, క్రికెట్, క్యారం బోర్డ్, తాడాట ఆటలు ఆడించడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు...

Tuesday, 18 June 2024

Digital Classes day Celebrations at MPPS Uppununthala Boys

బడిబాట కార్యక్రమంలో భాగంగా డిజిటల్ తరగతుల దినోత్సవం: ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా డిజిటల్ తరగతుల దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొజెక్టర్ బిగ్ స్క్రీన్ పైన ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్ డిజిటల్ తరగతులు విద్యార్థులకు ఏవిధంగా ఉపయోగపడతాయో వివరిస్తూ నూతన పాఠ్యపుస్తకాలు అన్నింటిలోనూ ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన క్యూ.ఆర్...

Saturday, 15 June 2024

Free Textbooks, Workbooks and Uniforms distribution at MPPS Uppununthala Boys

 విద్యార్థులకు ఏకరూప దుస్తులు మరియు పాఠ్యపుస్తకాల పంపిణీ:ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, అభ్యాస పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ ఈ నూతన పాఠ్యపుస్తకాలు విద్యార్థుల వికాసానికి ఎంతో తోడ్పడుతాయన్నారు. వీటిని విషయ నిపుణులు, ఉన్నత విద్యావంతులు, సుదీర్ఘ అనుభవం కలిగిన వారు విద్యార్థుల...

Thursday, 13 June 2024

Samoohika Aksharabyasam at MPPS Uppununthala Boys| బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం:ఈరోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలతో ఉపాధ్యాయులు,విద్యార్థులు నివాళులర్పించడం జరిగింది. పాఠశాలలో ఈ సంవత్సరం నూతనంగా చేరిన విద్యార్థుల పలకలపై అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ...

District Collector Uday Kumar sir, IAS visits State Best Practices School MPPS Uppununthala Boys

 విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ IAS గారు.విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ IAS గారు.రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూల్ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఉందయ్ కుమార్, IAS గారు:గతంలో పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉండే స్థితి నుంచి ఈ రోజు 80 మంది విద్యార్థులు పెరగడానికి చేసిన కృషిని కలెక్టర్ గారు...

Wednesday, 12 June 2024

World Day Against Child Labour 2024 | ఘనంగా ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం

 ఘనంగా ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం:ఈ రోజు మధ్యాహ్నం 2 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలబాలికలు అందరూ కూడా పనుల్లో చేరకుండా పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకోవాలని పిలుపునిచ్చారు. బాలల విద్యాహక్కు,...

Tuesday, 23 April 2024

Annual Day Celebrations 2024 at MPPS Uppununthala Boys

ఘనంగా నిర్వహించిన వార్షిక దినోత్సవం: ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన వార్షిక దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు, పాఠశాల AAPC చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు పాల్గొని పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు,...

Congratulations to students who got 5th gurukula seats in V TGCET 2024

5వ తరగతి గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు: 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష 2024 ఫలితాల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా  మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల నుండి ఏడుగురు విద్యార్థులు ఆడేపు మురళి - అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, మస్కూరి అరవింద్ - లింగాల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో, బొల్లె ప్రవీణ, నడిగడ్డ వరలక్ష్మి, ఆలూరి పల్లవి, పొట్టల సిరి లకు బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మన్ననూర్ లో, మేకల అక్షర - వంగూర్...

Friday, 9 February 2024

V TGCET 2024 Model test has been conducted at MPPS Uppununthala Boys

 గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం మాదిరి పరీక్ష నిర్వహణ: రేపు ఉదయం 11 గం.లకు తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2024 (V TGCET 2024) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సన్నద్దం కావడం కోసం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్ విద్యార్థులకు పరీక్ష గురించి ప్రొజెక్టర్...

Wednesday, 24 January 2024

National Girl Child Day 2024 celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా జాతీయ బాలికల దినోత్సవం: ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ మహిళలు నేడు చాలా రంగాల్లో రాణిస్తున్నారని, గొప్ప స్థాయికి చెరుకున్న మహిళల గురించి వివరించారు. పూర్వం నుంచి ఇప్పటివరకు బాలికల పట్ల, మహిళల పట్ల లింగ వివక్షత కొనసాగుతూనే ఉంది. ఆధునిక కాలంలో...

Tuesday, 23 January 2024

127th Birth Anniversary Celebrations of Subhas Chandra Bose at MPPS Uppununthala Boys

 ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి: ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ గారు 1897 సంవత్సరంలో జనవరి 23న ఒరిస్సా రాష్ట్రంలో కటక్ పట్టణంలో జానకినాథ్ బోస్, ప్రభావతి లకు జన్మించారని, బాగా చదువుకుని...

Wednesday, 3 January 2024

National women teacher 's day celebrations at MPPS Uppununthala Boys

 ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో భారత దేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి ఫూలే గారి 193వ జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ను ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  ముందుగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సావిత్రి భాయి ఫూలే గారి చిత్ర పటానికి పూలతో నివాళులు అర్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, శ్రీనివాసులు సార్,...