ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి తెలియజేస్తూ సహ పాఠ్య కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణ, అభివృద్ధి సంబంధించిన పనులలో, మీ వృత్తికి సంబంధించిన విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.
అదేవిధంగా ఇంటి వద్ద విద్యార్థులు చదువుకోవడానికి అనువైన గాలి వెలుతురు వచ్చేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయాలని, టీవీ, మొబైల్ వంటి శబ్దాలు రాకుండా చూడాలని, అక్కడ వారు చదువుకోవడానికి, ఇంటి పని పూర్తి చేయడానికి ప్రోత్సహించాలని వివరించారు. విద్యార్థులు నేర్చుకున్న సామర్థ్యాల సాధన కోసం ఇంటింటా చదువుల పంట యాప్ ని ఉపయోగించాలన్నారు. పాఠశాల అవసరాలను తెలియజేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.
ఈ సమావేశంలో గ్రామ పెద్దలు పాత్కుల రామచంద్రయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆలూరి లింగమయ్య, బొల్లె పర్వతాలు, ఆలూరి తిరుపతయ్య, సున్నం కురుమయ్య,మల్లయ్య, సునిత, శారద, శిరీష, లలిత, కల్పన, యాదమ్మ, వెంకటమ్మ, చంద్రకళ, శ్రీలత, అనిత, సైదమ్మ, శైలజ, రాధ, బాలమ్మ, విజయ, బి.అనిత, సుహాసిని, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment