బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పాలమూరు ఎఆర్ఐ ఫోరం వారు అందించిన చదరంగం బోర్డులతో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు అవగాహన కల్పిస్తూ చదరంగం ఆట పైన ఆసక్తిని పెంచుతున్నారు. విద్యార్థులు చదరంగం ఆడటం వల్ల వారిలో మేధో వికాసం అభివృద్ధి చెందుతుందని, ఆట నియమాలు తెలుసుకొని, క్రమశిక్షణతో గెలవడానికి ఉన్న వివిధ మార్గాలను అన్వేషించడం, ప్రమాదంలో ఉన్నప్పుడు ఉపాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించడం, వేగంగా ఖచ్చితత్వంతో ఆలోచించడం, విజయం కోసం ఓపికతో వ్యవహరించడం, గెలుపు ఓటముల ను సమానంగా స్వీకరించడం ద్వారా వారు విద్యలో కూడా రాణిస్తారని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకుంటారని ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ చదరంగం బోర్డులు అందజేసిన పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం వ్యవస్థాపకులు రవి ప్రకాష్ రెడ్డి గారికి మరియు ప్రతినిధులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.