Tuesday, 5 August 2025

91st Birth Anniversary Celebration of Professor Jaya Shankar sir

ఘనంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి:

ఈ రోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 91వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు, జయశంకర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


అనంతరం కొత్తపల్లి జయశంకర్ గారి గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తూ జయశంకర్ గారు హన్మకొండ జిల్లాలోని ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో పేద కుటుంబంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 వ సంవత్సరం ఆగష్టు 6న జన్మించారు. 

బాగా చదువుకుని ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి చేసి కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పని చేశారన్నారు. 

తెలంగాణ తొలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణకు నీల్లు, నిధులు, నియమాకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించి పేద ప్రజల తరపున ఉద్యమించిన ఆయన 2011వ సంవత్సరం, జూన్ 21 న అమరుడైనారు. ఆయన పేరున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, వారికి నాణ్యమైన విద్యను అందించడానికి, విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

0 comments:

Post a Comment