Saturday, 23 August 2025

National Space Day Celebrations 2025 - Rocket Experiment at MPPS Uppununthala Boys

ఘనంగా జాతీయ అంతరిక్ష దినోత్సవం - బాటిల్ రాకెట్ ప్రయోగం:



 ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23, 2023న చంద్రయాన్ -3 ద్వారా చంద్రుని దక్షిణ ధృవం లో విజయవంతంగా ల్యాండింగ్ కావడానికి గుర్తుగా 2024 సం నుంచి జరుపుకొంటున్నామని, భారత దేశం అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధించి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్పగా రాణిస్తుందని, మనం అనుభవిస్తున్న అన్ని ఆధునిక సౌకర్యాల వెనకాల శాస్త్రజ్ఞుల కృషి ఎంతో ఉందని తెలియజేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు రాకేట్ లతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఎన్నో రంగాల్లో అవి సమాచారాన్ని ఇస్తూ దేశానికి, ప్రజలకు సేవలు అందిస్తున్నవని వివరించారు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని, అది 65 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని అందుకే ఏం వస్తువును పైకి విసిరినా అది కిందికి వస్తుందని దీన్ని దాటాలంటే అంతరిక్షంలోకి రాకెట్లను సెకను కు 11.2 కి.మీ వేగంతో పంపించాలన్నారు. ఈ రాకెట్లు న్యూటన్ 3వ నియమం చర్యకు ప్రతిచర్య ఆధారంగా పైకి వెళ్తాయని బాటిల్ రాకెట్ ప్రయోగం ద్వారా విద్యార్థులకు వివరించడం జరిగింది. విద్యార్థులు బాటిల్ రాకెట్ పైకి వెళ్ళడం చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని విద్యార్థులు ఎందుకు, ఏమిటి, ఎలా అని ఆలోచించి, పరిశీలించి, పరిశోధించి నిర్దారణ చేసుకొని శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా దేశానికి సేవలు అందించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.

బాటిల్ రాకెట్ ప్రయోగం:


0 comments:

Post a Comment