జాతీయ స్థాయి విద్యా శిక్షణకు ఎంపికైన ఉపాధ్యాయున్ని అభినందించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు:
ఈ రోజు ఉప్పునుంతల బాలుర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు చందన, సంగీత లు మరియు విద్యార్థులు రాజస్థాన్ రాష్ట్రంలో ఉదయ్ పూర్, సిసిఆర్టీ లో జాతీయ విద్యా విధానం 2020 లో భాగంగా బోధనను ఆసక్తిగా మార్చుటకు విద్యలో పప్పెట్రి పాత్ర అనే అంశము పైన ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 10 వరకు 15 రోజుల పాటు జాతీయ స్థాయి విద్యా శిక్షణకు వెల్లడానికి పాఠశాల నుంచి రిలీవ్ అవుతున్న సందర్భంగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న గాజుల వెంకటేష్ ను పుష్పగుచ్చం ఇచ్చి, శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ జాతీయ విద్యా శిక్షణ కార్యక్రమానికి మా పాఠశాల నుంచి వెంకటేష్ సార్ వెళ్ళడం మాకు గర్వంగా ఉందని తెలియజేశారు. వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ శిక్షణ కార్యక్రమానికి 10 మంది ఉపాధ్యాయులు హాజరవుతున్నారని, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం, హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారుల సమావేశంలో బెస్ట్ టీచింగ్ ప్రాక్టీసెస్ పైన చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా వీరిని ఎంపిక చేశారని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఏ విధంగా అభివృద్ధి సాధిస్తున్నదో వివరిస్తానని, ఇక్కడ అమలు పరుస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు భోధనోపకరణాలతో మరియు ఐసిటి టూల్స్ ఉపయోగించి కృత్యాధార పద్దతిలో అర్థవంతమైన బోధన, కృత్రిమ మేధ/ఏఐ తో డిజిటల్ తరగతులు, 5వ తరగతి గురుకుల ప్రవేశాలకు ప్రత్యేక తరగతులు, ఉచిత ఆన్లైన్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, చిల్డ్రన్ బ్యాంకు, ప్రత్యేక దినోత్సవాలు, బాలల సభ, ప్రయోగాలు, పాఠశాలకు వనరులను సమకూర్చడంలో దాతలు, తల్లిదండ్రుల సహకారం, వీటి కోసం సోషల్ మీడియా ను ఉపయోగించడం, పాఠశాల వెబ్సైట్, యూట్యూబ్ చానల్, వాట్సప్ గ్రూపు మొ.న అన్ని అంశాలను జాతీయ స్థాయి వేదికపైన వివరిస్తానని, అదేవిధంగా ఈ శిక్షణలో బోధనను ఆసక్తిగా మార్చుటకు పప్పెట్రీ/బొమ్మల పాత్ర, మెలకువలు, బోధనా పద్ధతుల గురించి తెలుసుకొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, అభివృద్ధికి మరింతగా కృషి చేస్తానని తెలియజేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలియజేశారు.