Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Showing posts with label Parent Teacher Meeting. Show all posts
Showing posts with label Parent Teacher Meeting. Show all posts

Tuesday, 8 July 2025

Parent Teacher Meeting on Parents as Partners at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం(పి.టి.ఎం) నిర్వహణ: పాఠశాల అభివృద్ధిలో, పిల్లల అభ్యసన అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి!

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి తెలియజేస్తూ సహ పాఠ్య కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణ, అభివృద్ధి సంబంధించిన పనులలో, మీ వృత్తికి సంబంధించిన విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అదేవిధంగా ఇంటి వద్ద విద్యార్థులు చదువుకోవడానికి అనువైన గాలి వెలుతురు వచ్చేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయాలని, టీవీ, మొబైల్ వంటి శబ్దాలు రాకుండా చూడాలని, అక్కడ వారు చదువుకోవడానికి, ఇంటి పని పూర్తి చేయడానికి ప్రోత్సహించాలని వివరించారు. విద్యార్థులు నేర్చుకున్న సామర్థ్యాల సాధన కోసం ఇంటింటా చదువుల పంట యాప్ ని ఉపయోగించాలన్నారు. ఏఐ ఆధారిత ఏ.ఎక్స్.ఎల్ డిజిటల్ లెర్నింగ్ గురించి వివరించారు.

ముఖ్య అతిథులుగా హాజరైన సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు కోసం నెలకు ఒక రోజు నిర్వహించే ఈ సమావేశంలో తల్లిదండ్రులు అందరూ పాల్గొని వారి ప్రగతిని తెలుసుకొని పాఠశాల అభివృద్ధికి, ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల కంటే ఈ పాఠశాలలో బాగా చదవు చెప్తున్నారని, విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.




Thursday, 12 June 2025

Welcoming students on reopening day in Grand PTM in the part of Pro Jayashankar Badi Bata programme 2025

పాఠశాల పునః ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు & విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ:

ఈ రోజు ఉదయం 9 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పాఠశాల పునః ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలను మామిడి తోరణాలతో అలంకరించడం జరిగింది, విద్యార్థులకు ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికి నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బడి ఈడు పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించడం గురించి చర్చించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో అర్థవంతమైన కృత్యాధార భోధనతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరడం జరిగింది. అతిథులుగా హాజరైన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వర్క్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని అందుకు నిదర్శనం 49 గురుకుల సీట్లు సాధించడమే అన్నారు. కాబట్టి గ్రామ ప్రజలు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Friday, 9 May 2025

PTM conducts in tha part of Advance Badi Bata programme 2025

ఉప్పునుంతలలో బడి బాట కార్యక్రమంలో భాగంగా పి.టి.ఎం నిర్వహణ:
ముందస్తు ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 8 గం.లకు తిరుమల గుడి కూడలి, ఉప్పునుంతలలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం (పి.టి.ఎం) నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో అర్థవంతమైన బోధన చేస్తున్నామని, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛ పూరిత, అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో చదువును అందిస్తున్నామని వివరించారు. ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది మన పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారని తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లు, నోటు పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నదని వివరించారు.

పాఠశాలలో విశాల తరగతి గదుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాబట్టి మన గ్రామంలోని బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులను కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన గ్రామ పెద్దలు, మండల నాయకులు అనంత రెడ్డి గారు మాట్లాడుతూ విషయ నిపుణులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయ బృందం అంకితభావంతో పనిచేసి గురుకుల సీట్లు సాధిస్తూ, ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని, ఈ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు కాబట్టే ఉపాధ్యాయులుగా పని చేస్తున్న గాజుల వెంకటేష్ తన కుమారున్ని కూడా ఇదే పాఠశాలలో చదివించడం అందరికీ ఆదర్శమని, విద్య ద్వారానే జీవన ప్రమాణాలు మెరుగు పడుతాయని, గౌరవం లభిస్తుంది కాబట్టి మన గ్రామంలోని ప్రజలు అందరు కూడా వారి పిల్లలను మన ప్రభుత్వ బడిలోనే చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో మాజీ ఎం.పి.టి.సి పాత్కుల రామ్ చంద్రయ్య సైదమ్మ గారు, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, బిసి నాయకులు తిరుపతయ్య గౌడ్ గారు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 21 December 2024

Parent Teacher Meeting at MPPS Uppununthala Boys on 21/12/2024

 ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం (PTM): 


ఈ రోజు ఉదయం 9:30 గం.లకు ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశం (PTM) ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ర్ అద్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆహారోత్సవం నిర్వహించి పోషక విలువల గురించి చర్చించడం జరిగింది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, చందన మేడం, సంగీత మేడం లు మాట్లాడుతూ పోషక విలువలు సమృద్ధిగా ఉన్న పాలు, పండ్లు, గుడ్లు, మాంసం, ఆకు కూరలు, కూరగాయలు, తృణ ధాన్యాలు లతో తయారు చేసిన ఆహార పదార్థాలు , మొలకెత్తిన గింజలు పిల్లలకు అందించాలని సూచించడం జరిగింది. పోషక విలువలు గల ఆహారం పిల్లలకు అందించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని, ఏకాగ్రతతో బాగా చదువుకుంటారని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించడం జరిగింది.

అనంతరం విద్యార్థులు తెచ్చిన ఆహా పదార్థాలను ప్రదర్శించడం జరిగింది.



Saturday, 21 September 2024

Parent Teacher Meeting for September 2024 at MPPS Uppununthala Boys

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సమావేశానికి ఆహ్వానించి, వారి పిల్లలు ఇంటి వద్ద ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, ప్రతి సారి ఒక విషయం పైన చర్చించడం జరుగుతుంది అని ఈ సారి జ్వరాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పోస్టర్ ను ప్రొజెక్టర్ బిగ్ స్క్రీన్ పైన  వివరిస్తూ 1. ఇంటి పక్కల నిలువ నీరు ఉండకుండా చూసుకోవాలని, 2. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, 3. శుభ్రమైన నీరు తాగాలని, 4. జ్వరం వచ్చిన వారు మాస్క్ ను ధరించాలని, 5. తేలికపాటి ఆహారం తీసుకోవాలని, 6. డాక్టర్ ను సంప్రదించాలని తగు జాగ్రత్తలు తీసుకోని విద్యార్థులు రోగాల భారిన పడకుండా చూసుకొని వారిని ఆరోగ్యంగా ఉంచుతూ క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని అప్పుడే విద్గయార్థులు బాగా చదువుకుంటారని తెలియజేయటం జరిగింది. అనంతరం విద్యార్థుల పనితీరును తరగతుల వారిగా విషయాల వారీగా ప్రదర్శింప చేయటం జరిగింది . ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను తల్అలిదండ్రులు భినందించారు. అభ్యాసనలో వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల సహకారం అవసరం కాబట్టి వారిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి వారి ప్రగతికి కృషి చేయాలని కోరడం జరిగింది. ఇంగ్లీష్ లోని 26 అక్షరాల 44 శబ్దాలను నేర్చుకోవడానికి Jolly Phonics వారు రూపొందించిన విధానం లో సులభంగా చదవడం, రాయడం నేర్పడం జరుగుతుందని Jolly Phonics యాప్ ని మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయించాలని తల్లిదండ్రులను కోరడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించడం జరిగింది.

ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ అరుణ లింగమయ్య గారు, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Saturday, 17 August 2024

Parent Teacher Meeting at MPPS Uppununthala Boys for August 2024

 
తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సమావేశానికి ఆహ్వానించి, వారి పిల్లలు ఇంటి వద్ద ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, ప్రతి సారి ఒక విషయం పైన చర్చించడం జరుగుతుంది అని ఈ సారి భాద్యత గల పౌరులను తయారు చేయడం గురించి వివరిస్తూ విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తయారు చేయాలంటే రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు తెలుసుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాటిని పాటించాలని వారిని చూసి విద్యార్థులు నేర్చుకుంటారన్నారు. ముఖ్యంగా స్వేచ్ఛ, బాధ్యత, గౌరవం, దయ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించాలని తల్లిదండ్రులకు తెలియజేశారు. వీటిని తల్లిదండ్రులు కూడా పాటించాలని కోరారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని వివిధ విషయాల్లో తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

Saturday, 20 July 2024

Parent Teacher Meeting has been conducted at MPPS Uppununthala Boys

 
తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి తెలియజేస్తూ సహ పాఠ్య కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణ, అభివృద్ధి సంబంధించిన పనులలో, మీ వృత్తికి సంబంధించిన విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.

అదేవిధంగా ఇంటి వద్ద విద్యార్థులు చదువుకోవడానికి అనువైన గాలి వెలుతురు వచ్చేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయాలని, టీవీ, మొబైల్ వంటి శబ్దాలు రాకుండా చూడాలని, అక్కడ వారు చదువుకోవడానికి, ఇంటి పని పూర్తి చేయడానికి ప్రోత్సహించాలని వివరించారు. విద్యార్థులు నేర్చుకున్న సామర్థ్యాల సాధన కోసం ఇంటింటా చదువుల పంట యాప్ ని ఉపయోగించాలన్నారు. పాఠశాల అవసరాలను తెలియజేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

ఈ సమావేశంలో గ్రామ పెద్దలు పాత్కుల రామచంద్రయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆలూరి లింగమయ్య, బొల్లె పర్వతాలు, ఆలూరి తిరుపతయ్య, సున్నం కురుమయ్య,మల్లయ్య, సునిత, శారద, శిరీష, లలిత, కల్పన, యాదమ్మ, వెంకటమ్మ, చంద్రకళ, శ్రీలత, అనిత, సైదమ్మ, శైలజ, రాధ, బాలమ్మ, విజయ, బి.అనిత, సుహాసిని, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.