Saturday, 21 September 2024

Parent Teacher Meeting for September 2024 at MPPS Uppununthala Boys

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సమావేశానికి ఆహ్వానించి, వారి పిల్లలు ఇంటి వద్ద ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, ప్రతి సారి ఒక విషయం పైన చర్చించడం జరుగుతుంది అని ఈ సారి జ్వరాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పోస్టర్ ను ప్రొజెక్టర్ బిగ్ స్క్రీన్ పైన  వివరిస్తూ 1. ఇంటి పక్కల నిలువ నీరు ఉండకుండా చూసుకోవాలని, 2. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, 3. శుభ్రమైన నీరు తాగాలని, 4. జ్వరం వచ్చిన వారు మాస్క్ ను ధరించాలని, 5. తేలికపాటి ఆహారం తీసుకోవాలని, 6. డాక్టర్ ను సంప్రదించాలని తగు జాగ్రత్తలు తీసుకోని విద్యార్థులు రోగాల భారిన పడకుండా చూసుకొని వారిని ఆరోగ్యంగా ఉంచుతూ క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని అప్పుడే విద్గయార్థులు బాగా చదువుకుంటారని తెలియజేయటం జరిగింది. అనంతరం విద్యార్థుల పనితీరును తరగతుల వారిగా విషయాల వారీగా ప్రదర్శింప చేయటం జరిగింది . ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను తల్అలిదండ్రులు భినందించారు. అభ్యాసనలో వెనుకబడిన విద్యార్థులకు ఉపాధ్యాయుల మరియు తల్లిదండ్రుల సహకారం అవసరం కాబట్టి వారిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి వారి ప్రగతికి కృషి చేయాలని కోరడం జరిగింది. ఇంగ్లీష్ లోని 26 అక్షరాల 44 శబ్దాలను నేర్చుకోవడానికి Jolly Phonics వారు రూపొందించిన విధానం లో సులభంగా చదవడం, రాయడం నేర్పడం జరుగుతుందని Jolly Phonics యాప్ ని మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయించాలని తల్లిదండ్రులను కోరడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించడం జరిగింది.

ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ అరుణ లింగమయ్య గారు, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment