Monday, 25 August 2025
Our School Teacher has been selected for National Level Educational Training
Tuesday, 12 August 2025
Uppununthala MEO Chandra Shekhar sir visits MPPS Uppununthala Boys and appreciates students and teachers
ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ గారు సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించారు. విద్యార్థుల చేత తెలుగు, ఇంగ్లీష్ చదివించారు, గణితం లోని చదుర్విద ప్రక్రియలను చేయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ప్రదర్శించిన నాలుగవ తరగతి విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, ఆలూరి చంటి, ఐదవ తరగతి విద్యార్థి ఎదురిశెట్టి వరుణ్ తేజ్ లను అభినందించారు. 10వ తరగతి విద్యార్థులు కూడా చెప్పలేని విధంగా ఈ 4,5 తరగతుల విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ ను చాలా సులభంగా, ధారాళంగా చెప్తున్నారని, ఈ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. పాఠశాల రిజిస్టర్ లు, రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి తమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీ ఉన్నందున మరొక ఉపాధ్యాయున్ని కేటాయించాలని ఎం.ఈ.వో గారిని కోరడం జరిగింది.
Wednesday, 4 June 2025
Felicitation on Selection of Best Practices School MPPS Uppununthala Boys
ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో, ఐసిటీ తో అర్థవంతమైన బోధన చేయడం, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో చదువును అందించడంతో ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారు, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది ఈ పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల కృషిని తెలుసుకుని దాతలు ప్రొజెక్టర్, కలర్ ప్రింటర్, కంప్యూటర్ లు, స్టడీ మెటీరియల్, స్కూల్ బ్యాగ్ లు మొదలైనవి అందించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ తన పిల్లలను ఇదే పాఠశాలలో చదివించడం. ఇవన్నీ గమనించి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను గత ఏడు సంవత్సరాల్లో 20 నుంచి 73 కి పెంచడం జరిగింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ పాఠశాలను బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా ఎంపిక చేశారు. ఈ పాఠశాల నుంచి ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ రేపు హైదరాబాద్ లో జరిగే ఎం.ఇ.వో ల సమావేశంలో పాఠశాల అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేస్తున్న ఉపాధ్యాయుల కృషిని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి షఫ్రోద్దీన్ గారు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి గారు, మండల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు మరియు సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ లను విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించి అభినందించారు.
Tuesday, 22 April 2025
Annual Day Celebrations 2025 at MPPS Uppununthala Boys
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా వార్షిక దినోత్సవం:
ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన వార్షిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి అతిథులుగా మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు, గ్రామ పెద్దలు అనంత రెడ్డి గారు, మండల పరిషత్ అధికారి నారాయణ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి గారు, ఎల్.ఎఫ్.ఎల్. హెచ్.ఎం బిచ్యనాయక్ గారు, సన్మాన దాత పాత్కుల రామ్ చంద్రయ్య గారు, జ్ఞాపికల దాత ఎదురిశెట్టి మల్లేష్ గారు పాల్గొన్నారు.
కార్యక్రమంలో ముందుగా అతిథులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్ గారు, చందన గారు, సంగీత గారు మహనీయుల చిత్ర పటాలకు పూల దండలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో నేర్చుకున్న విషయాలు, గురుకుల సీట్లు సాధించడానికి చేసిన కృషిని, ఉపాధ్యాయులు అందించిన సహకారాన్ని, మిత్రులతో, ఉపాధ్యాయులతో వారికున్న అనుభూతులను పంచుకున్నారు. తరువాత ప్రధానోపాధ్యాయులు పాఠశాల ప్రగతి నివేదికను తెలియచేస్తూ ఈ సంవత్సరం 8 మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారని, ఇప్పటి వరకు గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 48 గురుకుల సీట్లు విద్యార్థులు సాధించారని, వారికి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఆంగ్ల మాధ్యమంలో 1 నుంచి 5వ తరగతి వరకు కృత్యాధార పద్దతిలో విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని వివరించారు. మన ఊరి పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. తర్వాత ఉపాధ్యాయులు వెంకటేష్ గారు మాట్లాడుతూ దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి పాఠశాలకు కావాల్సిన వనరులు సమకూర్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని, నా రెండవ కుమారుడు రాహుల్ ని కూడా ఇదే పాఠశాలలో చదివిస్తున్నానని, ఇక్కడ సుదీర్ఘ అనుభవం, విషయ నిపుణులు అయిన ఉపాధ్యాయులు ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛ పూరిత వాతావరణంలో బోధనోపకరణాలతో అర్థవంతంగా బోధించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ గ్రామ విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు.
అనంతరం అతిథులు గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులు ఆలూరి అక్షర, బొల్లె తన్వి, ఎదురిశెట్టి కీర్తన, ఇప్పటి భవ్య శ్రీ, ఆలూరి పూజిత, ఎదురిశెట్టి వరుణ్ తేజ్, బొల్గం మహేందర్ గౌడ్, జిల్లెల శివ లను శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందచేశారు, అదేవిధంగా వార్షిక పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 1వ తరగతి విద్యార్థులు మధనాగుల ప్రతిభ, మేకల భాను, 2వ తరగతి విద్యార్థులు బొల్లె చక్రవర్తి, బాజ లాస్య, పొట్టల అనన్య, 3వ తరగతి విద్యార్థులు బొడ్డుపల్లి యశ్వంత్, మధనాగుల అలేఖ్య, 4వ తరగతి విద్యార్థులు ఆలూరి శ్రీజ, సదగొండ రమేష్, 5వ తరగతి విద్యార్థులు బింగి సైదులు, మధనాగుల దివ్య లకు ఉత్తమ విద్యార్థి అవార్డులుగా జ్ఞాపికలను అందచేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ మీడియంలో అందించి సుమారు 50 మంది విద్యార్థులను గురుకులాలకు పంపించడం చాలా గొప్ప విషయమని, దానికి కృషి చేసిన ఉపాధ్యాయులు లను అభినందించడం జరిగింది. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను, అతిథులను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల విద్యా ప్రగతికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.
అనంతరం నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
ఈ కార్యక్రమంలో పాత్కుల నిరంజన్ గారు, రామలింగయ్య గారు, ఉపాధ్యాయులు కలమండల శ్రీనివాసులు గారు, వందేమాతరం ఫౌండేషన్ రజిత గారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలూరి వెంకటేష్ గారు, ఆలూరి పరమేశ్వర్ గారు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Friday, 4 April 2025
Congratulations to students who got gurukula seats in V TGCET 2025 Results
Thursday, 13 June 2024
District Collector Uday Kumar sir, IAS visits State Best Practices School MPPS Uppununthala Boys
రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ప్రాక్టీసెస్ స్కూల్ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఉందయ్ కుమార్, IAS గారు:
గతంలో పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉండే స్థితి నుంచి ఈ రోజు 80 మంది విద్యార్థులు పెరగడానికి చేసిన కృషిని కలెక్టర్ గారు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల సీట్లు వచ్చే లాగా ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని , దానితో ప్రతి సంవత్సరం గురుకుల సీట్లు సాధిస్తున్నారని, ఈ సంవత్సరం 10 సీట్లతో పాటు ఇప్పటి వరకు 40 సీట్లు సాధించారని, ఈ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న గాజుల వెంకటేష్ సార్ తన ఇద్దరి కుమారులు గౌతమ్, రాహుల్ లను ఇదే పాఠశాలలో చదివిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, గ్రామ పెద్దలు మరియు దాతల సహకారంతో ప్రొజెక్టర్, కంప్యూటర్ లు, ప్రింటర్, గురుకుల, నవోదయ స్టడీ మెటీరియల్ మొదలైనవాటిని సమకూర్చుకొని ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, డిజిటల్ తరగతులు, అబాకస్, చిల్డ్రన్ బ్యాంక్ వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో పాటు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ అందరూ సమిష్టిగా, సమన్వయంతో బట్టి విధానంలో కాకుండా పాఠాలు సులభంగా అర్థమయ్యేలా బోధనోపకరణాలతో కృత్యాదార బోధన చేస్తున్నారని, అదేవిధంగా వెంకటేష్ సార్ పాఠశాలకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, అందులో విద్యార్థుల తల్లిదండ్రులు అందరి నెంబర్లను యాడ్ చేయడం ద్వారా అనునిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయడం జరుగుతుందని, సెలవు రోజుల్లో కూడా విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా విద్యార్థులు చేయాల్సిన కృత్యాలను, ఇంటి పనిని వాట్సాప్ ద్వారా పంపించి, విద్యార్థులు చేసి పంపించిన వాటిని వాట్సాప్ లోనే దిద్ది విద్యార్థులకు తిరిగి పంపుతూ విద్యార్థులు నిరంతరం అభ్యసనంలో నిమగ్నం అయ్యేటట్లు చూడడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలకు ఒక వెబ్సైట్ ను , యూట్యూబ్ ఛానల్ తయారు చేసి అందులో విద్యార్థుల చూపిన ప్రతిభను, వారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను, పాఠశాలలో జరిగిన వివిధ కార్యక్రమాలను అప్లోడ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యాశాఖ అధికారులకు, మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా పాఠశాల గురించి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకొని, ఉపాధ్యాయులు కృషిని అభినందిస్తూ, పాఠశాలపై నమ్మకంతో వారి పిల్లలను ప్రైవేటు పాఠశాల నుండి తీసి మన బాలుర ప్రభుత్వ పాఠశాల ఉప్పునుంతలలో చేర్పించడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ వివరించారు.
అనంతరం కలెక్టర్ గారు విద్యార్థుల ప్రతిభను పరిశీలించి విద్యార్థులను మరియు ఉపాధ్యాయులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు. అదేవిధంగా మన ఊరు మన బడి పనుల పురోగతిని పరిశీలించడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కి మంజూరైన నిధులను ఖర్చు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామారావు సార్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, ఉప్పునుంతల ఏఈ సందీప్ సార్, ఏం.ఐ.యస్ కోఆర్డినేటర్ తిరుపతి గారు, పత్రికా విలేకరులు మరియు జిల్లా విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 23 April 2024
Congratulations to students who got 5th gurukula seats in V TGCET 2024
5వ తరగతి గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు: 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష 2024 ఫలితాల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల నుండి ఏడుగురు విద్యార్థులు ఆడేపు మురళి - అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, మస్కూరి అరవింద్ - లింగాల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో, బొల్లె ప్రవీణ, నడిగడ్డ వరలక్ష్మి, ఆలూరి పల్లవి, పొట్టల సిరి లకు బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మన్ననూర్ లో, మేకల అక్షర - వంగూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు విద్యార్థులను అభినందించడం జరిగింది. బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించడం జరిగింది. ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, మండల విద్యాశాఖ అధికారి రామారావు సార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, ఎఫ్.ఎల్.ఎన్ నోడల్ అధికారి చంద్రశేఖర్ సార్ లు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.
Saturday, 10 June 2023
Govt Tr Venkatesh sir joins his younger son Rahul in his working BPS Uppununthala Govt School
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా తాను పనిచేస్తున్న పాఠశాలలోనే తన కుమారుడిని చేర్పించిన ప్రభుత్వ ఉపాధ్యాయడు:
గాజుల వెంకటేష్ ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. అదే పాఠశాలలో 3సం.రాల క్రితం తన పెద్ద కుమారుడు గౌతమ్ ని చేర్పించారు. ఈ రోజు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హన్మంతు రెడ్డి సార్, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ సమక్షంలో చిన్న కుమారుడు రాహుల్ ని చేర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఈ పాఠశాల నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులు గురుకుల సీట్లు సాధిస్తున్నారు. అహ్లాదకరమైన స్వేచ్ఛ వాతావరణంలో బట్టి విధానంలో కాకుండా కృత్యాధార బోధనా పద్దతిలో అనుభవాల ద్వారా అభ్యసనం జరుగుతుంది. కంప్యూటర్ ఎడ్యుకేషన్, స్పోకెన్ ఇంగ్లీషు, ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ తరగుతులు నిర్వహిస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మౌళిక సదుపాయాలను సమకూర్చారు. పాఠ్య పుస్తకాలు, దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరడం జరిగింది. ఉపాధ్యాయులు బాలమణి మేడం, అజ్మతుల్లా సార్ పాల్గొన్నారు.