ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో, ఐసిటీ తో అర్థవంతమైన బోధన చేయడం, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో చదువును అందించడంతో ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారు, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది ఈ పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల కృషిని తెలుసుకుని దాతలు ప్రొజెక్టర్, కలర్ ప్రింటర్, కంప్యూటర్ లు, స్టడీ మెటీరియల్, స్కూల్ బ్యాగ్ లు మొదలైనవి అందించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ తన పిల్లలను ఇదే పాఠశాలలో చదివించడం. ఇవన్నీ గమనించి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను గత ఏడు సంవత్సరాల్లో 20 నుంచి 73 కి పెంచడం జరిగింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ పాఠశాలను బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా ఎంపిక చేశారు. ఈ పాఠశాల నుంచి ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ రేపు హైదరాబాద్ లో జరిగే ఎం.ఇ.వో ల సమావేశంలో పాఠశాల అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేస్తున్న ఉపాధ్యాయుల కృషిని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి షఫ్రోద్దీన్ గారు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి గారు, మండల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు మరియు సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ లను విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించి అభినందించారు.
0 comments:
Post a Comment