ఏఐ ఆధారిత డిజిటల్ తరగతుల పైన అవగాహన:
ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మధ్యాహ్నం 2 గం.లకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఏఐ ఆధారిత డిజిటల్ తరగతుల పైన అవగాహన కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ట్యాబ్ ద్వారా ఏఐ ఆధారిత ఏ.ఎక్స్.ఎల్ వెబ్సైట్ లో విద్యార్థులు తమ యొక్క పెన్ నెంబర్ ను ఎంటర్ చేసి ఏ విధంగా లాగిన్ కావాలి, తెలుగు, ఇంగ్లీష్ మరియు గణితం లకు సంబంధించిన అసెస్మెంట్ ఎలా పూర్తి చేయాలి, అసెస్మెంట్ పూర్తి చేసిన అనంతరం విద్యార్థుల స్థాయిని ఈ ఏఐ నిర్ధారించి వారికి అనుగుణమైన అభ్యసన కృత్యాలను, వీడియో పాఠాలను అందజేస్తుందని, వీటిని పూర్తి చేయడం ద్వారా విద్యార్థులు అభ్యసనం లో ప్రగతి సాధిస్తారని వివరించడం జరిగింది. అదేవిధంగా జాలి ఫోనిక్స్ యాప్ ద్వారా విద్యార్థులు ఇంగ్లీష్ లో రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, నెంబర్ కిడ్స్, మ్యాత్ కిడ్స్, మ్యాత్ గేమ్స్ యాప్ ల ద్వారా గణిత భావనలు సంఖ్యలు, వాటిని పోల్చడం, కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం మొ.నవి ఎలా నేర్చుకోవాలి, పాఠ్య పుస్తకాలలో ఉన్న క్యూఆర్ కోడ్ ల ఆధారంగా డిజిటల్ తరగతులు ఎలా చూడాలి అనేది విద్యార్థులకు వివరించడం జరిగింది. సాంకేతికతను విద్యా రంగంలో, బోధనలో ఉపయోగించుకొని మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లు విద్యార్థులకు తెలియజేశారు.
0 comments:
Post a Comment