Thursday, 12 June 2025

Welcoming students on reopening day in Grand PTM in the part of Pro Jayashankar Badi Bata programme 2025

పాఠశాల పునః ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు & విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ:

ఈ రోజు ఉదయం 9 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పాఠశాల పునః ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలను మామిడి తోరణాలతో అలంకరించడం జరిగింది, విద్యార్థులకు ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికి నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బడి ఈడు పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించడం గురించి చర్చించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో అర్థవంతమైన కృత్యాధార భోధనతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరడం జరిగింది. అతిథులుగా హాజరైన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వర్క్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని అందుకు నిదర్శనం 49 గురుకుల సీట్లు సాధించడమే అన్నారు. కాబట్టి గ్రామ ప్రజలు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment