Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Showing posts with label Donations. Show all posts
Showing posts with label Donations. Show all posts

Friday, 22 August 2025

Students play chess game at MPPS Uppununthala Boys

చదరంగం ఆటతో విద్యార్థుల్లో మేధో వికాసం!

 చదరంగం ఆటతో విద్యార్థుల్లో మేధో వికాసం!

బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పాలమూరు ఎఆర్ఐ ఫోరం వారు అందించిన చదరంగం బోర్డులతో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు అవగాహన కల్పిస్తూ చదరంగం ఆట పైన ఆసక్తిని పెంచుతున్నారు. విద్యార్థులు చదరంగం ఆడటం వల్ల వారిలో మేధో వికాసం అభివృద్ధి చెందుతుందని, ఆట నియమాలు తెలుసుకొని, క్రమశిక్షణతో గెలవడానికి ఉన్న వివిధ మార్గాలను అన్వేషించడం, ప్రమాదంలో ఉన్నప్పుడు ఉపాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించడం, వేగంగా ఖచ్చితత్వంతో ఆలోచించడం, విజయం కోసం ఓపికతో వ్యవహరించడం, గెలుపు ఓటముల ను సమానంగా స్వీకరించడం ద్వారా వారు విద్యలో కూడా రాణిస్తారని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకుంటారని ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ చదరంగం బోర్డులు అందజేసిన పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం వ్యవస్థాపకులు రవి ప్రకాష్ రెడ్డి గారికి మరియు ప్రతినిధులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Saturday, 19 July 2025

Shoes and School Bags free distribution by Maryada Foundation 2025 at MPPS Uppununthala Boys

విద్యార్థులకు బూట్లు & స్కూల్ బ్యాగ్ ల పంపిణీ:


ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు, ఉదయం 11 గం.లకు బాలికల ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు మర్యాద ఫౌండేషన్ తరపున ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారు బూట్లు, స్కూల్ బ్యాగ్ లు అతిథులతో కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అతిథులుగా హాజరైన మండల నాయకులు అనంత రెడ్డి గారు, ఎం.ఈ.వో చంద్రశేఖర్ గారు, కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ఉప్పునుంతల గ్రామానికి చెందిన మర్యాద ఫౌండేషన్ వ్యవస్థాపకులు మర్యాద రుక్మ రెడ్డి గారు మన గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి అమెరికాలో స్థిరపడ్డారు. విద్య ద్వారానే మెరుగైన జీవితాన్ని పొందొచ్చని తాను చదువుకున్న పాఠశాలకు, గ్రామానికి సహాయ సహకారాలు అందించాలని పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా విద్యార్థులకు 70 వేలతో 166 జతల బూట్లు, 70 స్కూల్ బ్యాగ్ లను ఉచితంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అందజేయడం ప్రశంసనీయం అని వారి సేవలను అభినందించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మర్యాద ఫౌండేషన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, బిచ్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, యువ నాయకులు భాస్కర్, రామచంద్రయ్య, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత రామచంద్ర రెడ్డి, లక్ష్మీ, జయప్రద, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

మర్యాద ఫౌండేషన్ వారు ఉచితంగా పంపిణీ చేసిన బూట్లు & స్కూల్ బ్యాగ్ లతో విద్యార్థులు

మర్యాద ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారిని అతిథులు, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది.

Saturday, 22 June 2024

School bags distributes by Mr. Maryada Rukma Reddy to MPPS Uppununthala Boys

 
విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ!

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు ఇదే పాఠశాలలో చదివి అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి మర్యాద రుక్మా రెడ్డి గారు, తన సోదరుడు మర్యాద కృష్ణ రెడ్డి గారితో స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేయించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ, ఉపాధ్యాయులు బాలమణి, వెంకటేష్ మాట్లాడుతూ పాఠశాల సాధించిన ప్రగతిని, విద్యార్థులు సాధించిన గురుకుల సీట్ల వివరాలను, పాఠశాలలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, చిల్డ్రన్ బ్యాంకు, గురుకుల, నవోదయ ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక తరగతులు, టి.ఎల్.ఎం తో కృత్యాధార అర్థవంతమైన బోధన వివరాలను తెలియజేసి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ రెడ్డి గారు విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ మేము కూడా ఇదే పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి చేరుకొన్నామని, పాఠ్యపుస్తకాలను భద్రపరచుకోవడాని ఉపయోగపడే స్కూల్ బ్యాగ్ లను పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా ఇవ్వడం సంతోషంగా ఉందని, మీరు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. పేరెంట్ రాంచంద్రయ్య , బాలికల పాఠశాల ఉప్పునుంతల హెచ్.ఎం నరసింహ రెడ్డి పాల్గొన్నారు.

Tuesday, 23 April 2024

Annual Day Celebrations 2024 at MPPS Uppununthala Boys



ఘనంగా నిర్వహించిన వార్షిక దినోత్సవం: ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన వార్షిక దినోత్సవంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు, పాఠశాల AAPC చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు పాల్గొని పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలియజేశారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు ఈ సంవత్సరం పాఠశాల సాధించిన అభివృద్ధిని, విద్యార్థుల ప్రతిభను, పాఠశాలలో చేపడుతున్న వివిధ వినూత్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం దాతలు పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య, EX MPTC గారు అందించిన రూ. 8000 లతో మరియు యం. నారాయణ, MPO, ఉప్పునుంతల గారు అందించిన రూ. 2000 లతో గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులు ఆడేపు మురళి, మస్కూరి అరవింద్, బొల్లె ప్రవీణ, నడిగడ్డ వరలక్ష్మి, ఆలూరి పల్లవి, పొట్టల సిరి, మేకల అక్షర లను శాలువాలతో సన్మానించి, తరగతి వారిగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉత్తమ విద్యార్థి అవార్డు మెమొంటో లతో పాటు నగదు బహుమతులను అందజేసి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకు వేసవి సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వీయ అభ్యసనానికి తగిన సూచనలు ఇచ్చారు.

నూతనంగా ఎన్నికైన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారిని, దాత పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య గారిని, గతంలో పాఠశాలకు 10 కుర్చీలను వితరణ చేసిన దాత పాత్కుల నిరంజన్ గారిని ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపచేశాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 23 December 2023

Navodaya and Gurukula Schools Entrance study material distribution by Saidulu Emmadi, Soft. Emp

 






విద్యార్థులకు నవోదయ, గురుకుల స్టడీ మెటీరియల్ పంపిణీ:ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల 4వ తరగతి విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్, 5వ తరగతి విద్యార్థులకు నవోదయ స్టడీ మెటీరియల్ లను మహదేవ్ పూర్ గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు తన మాతృ మూర్తి సరస్వతమ్మ గారితో కలిసి అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో దాత సైదులు గారు మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఈ స్థాయికి చేరుకున్న కాబట్టి పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపయోగపడే ఈ స్టడీ మెటీరియల్ అందిస్తున్నాను. కాబట్టి విద్యార్థులు వీటిని ఉపయోగించుకొని నవోదయ, గురుకుల సీట్లు సాధించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని మీరు కూడా పేద వారికి సహాయం చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు, విద్యార్థులు దాత సైదులు గారికి, సరస్వతమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. దాతలను శాలువాతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో PHD స్కాలర్ మహదేవ్,కుర్మయ్య, పరిమేష్ పాల్గొన్నారు.

Saturday, 19 August 2023

Two computers donate to PS Uppununthala Boys by Emmadi Saidulu sir, Software Employee & Motamari Madhu sir, Professor, PU

 











తేది. 19-08-2023 ఉదయం 10 గం.లకు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం (Parent Teacher Meeting) లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు, PU ప్రొఫెసర్ మోటమారి మధు గారు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలకు 30వేల రూపాయలతో 2 కంప్యూటర్లను విరాళంగా అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు దాతలను ఘనంగా శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. కాంప్లెక్స్ హెచ్ఎం హన్మంతు రెడ్డి సార్, హెచ్ఎం లక్ష్మీ నారాయణ సార్, బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. దాతలు సైదులు గారు, మధు గారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని, అందుకే  పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా పాఠశాలకు కంప్యూటర్లను ఇస్తున్నామని, తాము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి చేరుకొన్నామని విద్యార్థులు కూడా విద్యను నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.


ఈ సమావేశంలో సైదులు గారి శ్రీమతి భారతి గారు, పి.హెచ్.డి స్కాలర్ మహదేవ్ గారు, లక్ష్మణ్ గారు, శ్రీను గారు, మల్లేష్ గారు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 10 June 2023

Dr B.R Ambedkar's life history books donates by Mekala Rama Chandraiah garu



BPS ఉప్పునుంతల విద్యార్థులకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేసిన మేకల రామచంద్రయ్య:  పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కట్ట సరిత మేడం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5వ తరగతి విద్యార్థులు పాఠశాలతో, ఉపాధ్యాయులతో, విద్యార్థులతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సర్పంచ్ మేడం, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, దాత రామచంద్రయ్య గారు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పేద కుటుంబంలో జన్మించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పట్టుదలతో బాగా చదువుకొని ప్రపంచ మేధావిగా ఖ్యాతి గడించారని, రాజ్యాంగ రచన ద్వారా అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించారని ఆయన జీవిత చరిత్ర పుస్తకం చదివి స్పూర్తి పొంది మీరు కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలను, పెన్నులు,పెన్ను బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ భాస్కర్, నిరంజన్,శేఖర్, మల్లేష్, స్వామి, పరమేశ్ రామస్వామి, తిరుపతయ్య పాల్గొన్నారు.

Games material donates by Srikanth Bheema Garu


శ్రీకాంత్ బీమా గారు మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పును జాతులను సందర్శించి విద్యార్థులకు క్యారం బోర్డ్స్, వాలీబాల్స్, స్కిప్పింగ్ ,వైట్ బోర్డ్స్, చెస్ బోర్డ్స్, స్లేట్స్, రింగ్ బాల్స్, క్రికెట్ బ్యాట్స్, మొదలైన ఆట వస్తువులను విద్యార్థుులకు అందజేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు 🙏

Thursday, 30 March 2023

A student distributes pens, pencils to the students of PS Uppununthala Boys

 


Dictionaries distribution to students of PS Uppununthala Boys by their Teacher

 


ప్రభుత్వ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్ తన 34వ  పుట్టిన రోజు సందర్భంగా తన పాఠశాల విద్యార్థులకు డిక్షనరీలు, పెన్సిల్,ఎరేసర్& షార్ప్నర్ లను, అదేవిధంగా తల్లిలేని ఇద్దరు నిరుపేద విద్యార్థులకు గత విద్యా సంవత్సరం మాదిరిగానే ఇప్పుడు కూడా వారికి కావలసిన అన్ని నోటు పుస్తకాలు, పెన్నులు & పెన్సిల్ లు పంపిణీ చేయడం జరిగింది.

ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన సందర్భంగా విద్యార్థులు ఇంగ్లీష్ భాష పై పట్టు సాధించాలంటే డిక్షనరీ ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థులు ఈ డిక్షనరీ ని సద్వినియోగం చేసుకోని ఇంగ్లీష్ భాషను సులభంగా అవగాహన చేసుకోవాలని వెంకటేష్ సార్ విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులు ఎంతో సంతోషంతో పుట్టిన రోజు శుభాకాంక్షలు & కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఇలా విద్యార్థులతో పుట్టిన రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Monday, 6 March 2023

Software Employee Emmadi Saidulu Garu donates Navodaya Vidyalaya Books to students of PS Uppununthala Boys



5వ తరగతి విద్యార్థులకు నవోదయ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు:

ఈ రోజు ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు ఐదు వేల రూపాయలతో పంపించిన నవోదయ స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్ లు అందజేశారు. కలర్ ప్రింటర్, నవోదయ స్టడీ మెటీరియల్ లను అందించడమే కాకుండా కంప్యూటర్ ల్యాబ్ కోసం ఒక కంప్యూటర్ ను కూడా అందజేస్తానని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న  సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నవోదయ విద్యాలయాల్లో సెంట్రల్ సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అన్ని కార్యక్రమాలు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఈ పాఠశాలల్లో చదువుకున్న ఎందరో విద్యార్థులు IAS,IPS లాంటి ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఈ నవోదయ స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని సీటు సాధించి, భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొవాలని కోరారు.

Friday, 24 February 2023

Projector donates by Kunda Vedavathi, Dy E.E for digital clases

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో డిజిటల్ తరగతులు ప్రారంభం:

డిజిటల్ తరగతుల కోసం ప్రొజెక్టర్ ను తన నాన్న కీ.శే కుంద చెన్నకేశవులు గారి జ్ఞాపకార్థం వారి కూతురు కుంద వేద కుమారి,Dy.E.E, మాధవాని పల్లి గారు అందించారు.



ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మహనీయులు బుద్దుడు, అంబేద్కర్, సావిత్రి భాయి ఫూలే, సర్వే పల్లి రాధాకృష్ణ గారి ఫోటోలకు పూలతో నివాళులు అర్పించి, క్యాండిల్స్ వెలిగించిన తర్వాత ప్రొజెక్టర్ తో డిజిటల్ తరగతులను ముఖ్య అతిథులుగా హాజరైన ఉప్పునుంతల సర్పంచ్ కట్ట సరిత రెడ్డి మేడం గారు, మండల MEO రామారావు సార్ గారు, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ప్రసంగిస్తూ ఇప్పుడున్న డిజిటల్ యుగంలో డిజిటల్ తరగతుల ప్రాముఖ్యత పెరిగిందని వాటిని ఉపయోగించుని విద్యార్థులు పాఠాలను సులభంగా అర్థం చేసుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా గత నాలుగు సంవత్సరాలలో 18 మంది విద్యార్థులు గురుకుల సీట్లు పొందేలా, ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. మహనీయులు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గంలో సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి సహకరించేలా డిజిటల్ తరగతుల కోసం ప్రొజెక్టర్ అందించిన వేద కుమారి గారికి ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ డిజిటల్ తరగతుల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు, SMC సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు, యువకులు పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రొజెక్టర్ దాతకు పాఠశాల తరపున ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో SMC ఛైర్మన్ రాములు గారు, ఉపాధ్యాయులు బాలమణి మేడం గారు, వెంకటేష్ సార్ గారు, GPS ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు నర్సింహ రెడ్డి గారు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Monday, 13 February 2023

Software Employee Emmadi Saidulu garu donates Colour Printer to PS Uppununthala boys


ఈ రోజు మధ్యాహ్నం 1గం.లకు సాఫ్ట్వేర్ ఉద్యోగి మహదేవ్ పూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి సైదులు గారు తన భార్య భారతి, మిత్రుడు మహదేవ్ సమక్షంలో BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలకు 15వేల రూపాయల కలర్ ప్రింటర్ ను విరాళంగా అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వారిని ఘనంగా శాలువాతో సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ విద్యార్థులకు, పాఠశాలకు ఎంతో ఉపయోగపడే కలర్ ప్రింటర్ ను విరాళంగా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.


ప్రింటర్ దాత సైదులు గారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని, అందుకే  పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా పాఠశాలకు ఇప్పుడు ప్రింటర్ ఇస్తున్నానని, అతి త్వరలో  కంప్యూటర్ ల్యాబ్ కోసం ఒక కంప్యూటర్ ను తన వంతు గా ఇస్తానని తెలియజేశారు. అదేవిధంగా 15 సెట్స్ నవోదయ బుక్స్ కూడా ఇస్తానని తెలియజేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎన్నో సమస్యల్ని అధిగమించి ఈ స్థాయికి చేరుకొన్నానని విద్యార్థులు కూడా ఎన్ని సమస్యలు ఉన్నా విద్యను నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.


నారుమొళ్ళ మహదేవ్ P.HD స్కాలర్ గారు మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇప్పుడు జర్నలిజంలో PHD చేస్తున్నాను. ఈ పాఠశాలలో గురుకుల, నవోదయ పాఠశాలల ప్రవేశం కోసం ప్రత్యేక తరగతులు, డిజిటల్ బోధన, స్పోకెన్ ఇంగ్లీష్, టైపింగ్, కంప్యూటర్ విద్య, చిల్డ్రన్ బ్యాంకు లాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను ఉపాధ్యాయులు చేస్తున్నారు కాబట్టి విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.


ఈ కార్యక్రమంలో సాయిని శ్రీనివాస్ గారు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలూరి వెంకటేష్ గారు, మధనాగుల ఆంజనేయులు గారు, అంపటి తిరుపతయ్య గారు, కాలూరి భారతి గారు,కె. రవికుమార్ గారు, పాత్కల నరేష్ గారు, బూర్సుల శీను గారు, పాత్కూల రాంప్రసాద్ గారు, మేడమోని చిన్న జంగయ్య గారు, ch. మల్లేష్ గారు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 25 August 2018

Plates Donated to MPPS Uppununthala Boys by Sri Gentala Mallaiah Sir

50 Plates donated to our students by Sri Gentala Mallaiah Sir on 20-07-2018
Sri Gentala Mallaiah Sir who is working as operator in Power project at Srisailam donated 50 plates to our students. Our students feel very happy and thankful to him.