విద్యార్థులకు బూట్లు & స్కూల్ బ్యాగ్ ల పంపిణీ:
ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు, ఉదయం 11 గం.లకు బాలికల ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు మర్యాద ఫౌండేషన్ తరపున ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారు బూట్లు, స్కూల్ బ్యాగ్ లు అతిథులతో కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అతిథులుగా హాజరైన మండల నాయకులు అనంత రెడ్డి గారు, ఎం.ఈ.వో చంద్రశేఖర్ గారు, కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ఉప్పునుంతల గ్రామానికి చెందిన మర్యాద ఫౌండేషన్ వ్యవస్థాపకులు మర్యాద రుక్మ రెడ్డి గారు మన గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి అమెరికాలో స్థిరపడ్డారు. విద్య ద్వారానే మెరుగైన జీవితాన్ని పొందొచ్చని తాను చదువుకున్న పాఠశాలకు, గ్రామానికి సహాయ సహకారాలు అందించాలని పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా విద్యార్థులకు 70 వేలతో 166 జతల బూట్లు, 70 స్కూల్ బ్యాగ్ లను ఉచితంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అందజేయడం ప్రశంసనీయం అని వారి సేవలను అభినందించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మర్యాద ఫౌండేషన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, బిచ్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, యువ నాయకులు భాస్కర్, రామచంద్రయ్య, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత రామచంద్ర రెడ్డి, లక్ష్మీ, జయప్రద, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
మర్యాద ఫౌండేషన్ వారు ఉచితంగా పంపిణీ చేసిన బూట్లు & స్కూల్ బ్యాగ్ లతో విద్యార్థులు
మర్యాద ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారిని అతిథులు, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది.
0 comments:
Post a Comment