Thursday, 10 July 2025

Guru Purnima Celebrations 2025 at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు:

 ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ గురుపౌర్ణమి ప్రత్యేకతను విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతిలో ప్రతి పౌర్ణమి కి ప్రత్యేకత ఉందని, అజ్ఞానం అనే అంధకారాన్ని, చీకటిని పారద్రోలే పౌర్ణమి రోజు ఉండే నిండు వెన్నెల వెలుతురు జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారని తెలియజేశారు. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు తదాగత బుద్ధుడు జ్ఞానోదయం పొంది దుఃఖం నివారణ మార్గాన్ని తన ఐదుగురు శిష్యులకు బోధించాడని, దీన్నే ధర్మ చక్ర ప్రవర్తన అంటారని తెలియజేశారు. ఇదే రోజు వేద జ్ఞానాన్ని అందించిన వ్యాసమహర్షి జన్మించారని తెలియజేశారు. ఉపాధ్యాయుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా జ్ఞానాన్ని పొంది, నైతిక విలువలను తెలుసుకొని, సత్ప్రవర్తనతో మెలిగి సత్కార్యాలు చేసి తాము ఎదుగుతూ, సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. జ్ఞానాన్ని అందించిన వారికి ఎల్లప్పుడూ వినమ్రంగా ఉంటూ వారిని గౌరవించాలన్నారు.


0 comments:

Post a Comment