Friday, 11 July 2025

Free Notebooks distribution 2025 at MPPS Uppununthala Boys

విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ:


ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిన నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. సబ్జెక్టుకు ఒకటి చొప్పున 1వ, 2వ తరగతి విద్యార్థులకు 3 నోటు పుస్తకాలు; 3వ, 4వ మరియు 5వ తరగతి విద్యార్థులకు 4 నోటు పుస్తకాలు  ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఉచిత పాఠ్య పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులతో పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కూడా నోటు పుస్తకాలు ఇవ్వడం విద్యాభివృద్ధికి ఎంతో సహాయంగా ఉంటుంది అన్నారు. విద్యార్థులు ఈ నోటు పుస్తకాలలో పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబులు రాసి వాటిని నేర్చుకోవాలని సూచించారు. రాయడం అనేది ఒక నైపుణ్యం అని విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను, తమ భావాలను తెలియజేయడానికి అక్షరాలను గుండ్రంగా, స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా రాయాలని సూచించారు. పరీక్షలో అధిక మార్కులు సాధించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్య మంత్రి, విద్యా శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తు లో టై, బెల్ట్, బూట్లు, బ్యాగ్ తో సహా అన్ని కలిపి ఒక ఎడ్యుకేషన్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

0 comments:

Post a Comment