Monday, 25 August 2025
Our School Teacher has been selected for National Level Educational Training
Saturday, 23 August 2025
National Space Day Celebrations 2025 - Rocket Experiment at MPPS Uppununthala Boys
Friday, 22 August 2025
Students play chess game at MPPS Uppununthala Boys
బాలురు ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పాలమూరు ఎఆర్ఐ ఫోరం వారు అందించిన చదరంగం బోర్డులతో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు అవగాహన కల్పిస్తూ చదరంగం ఆట పైన ఆసక్తిని పెంచుతున్నారు. విద్యార్థులు చదరంగం ఆడటం వల్ల వారిలో మేధో వికాసం అభివృద్ధి చెందుతుందని, ఆట నియమాలు తెలుసుకొని, క్రమశిక్షణతో గెలవడానికి ఉన్న వివిధ మార్గాలను అన్వేషించడం, ప్రమాదంలో ఉన్నప్పుడు ఉపాయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించడం, వేగంగా ఖచ్చితత్వంతో ఆలోచించడం, విజయం కోసం ఓపికతో వ్యవహరించడం, గెలుపు ఓటముల ను సమానంగా స్వీకరించడం ద్వారా వారు విద్యలో కూడా రాణిస్తారని, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకుంటారని ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ చదరంగం బోర్డులు అందజేసిన పాలమూరు ఎన్ఆర్ఐ ఫోరం వ్యవస్థాపకులు రవి ప్రకాష్ రెడ్డి గారికి మరియు ప్రతినిధులకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Tuesday, 12 August 2025
Uppununthala MEO Chandra Shekhar sir visits MPPS Uppununthala Boys and appreciates students and teachers
ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ గారు సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించారు. విద్యార్థుల చేత తెలుగు, ఇంగ్లీష్ చదివించారు, గణితం లోని చదుర్విద ప్రక్రియలను చేయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ప్రదర్శించిన నాలుగవ తరగతి విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, ఆలూరి చంటి, ఐదవ తరగతి విద్యార్థి ఎదురిశెట్టి వరుణ్ తేజ్ లను అభినందించారు. 10వ తరగతి విద్యార్థులు కూడా చెప్పలేని విధంగా ఈ 4,5 తరగతుల విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ ను చాలా సులభంగా, ధారాళంగా చెప్తున్నారని, ఈ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. పాఠశాల రిజిస్టర్ లు, రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి తమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీ ఉన్నందున మరొక ఉపాధ్యాయున్ని కేటాయించాలని ఎం.ఈ.వో గారిని కోరడం జరిగింది.
Monday, 11 August 2025
National Deworming Day Programme at MPPS Uppununthala Boys
Tuesday, 5 August 2025
91st Birth Anniversary Celebration of Professor Jaya Shankar sir
ఈ రోజు ఉదయం 11 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి 91వ జయంతి కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు, జయశంకర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కొత్తపల్లి జయశంకర్ గారి గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరిస్తూ జయశంకర్ గారు హన్మకొండ జిల్లాలోని ఆత్మకూర్ మండలం అక్కంపేట గ్రామంలో పేద కుటుంబంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 వ సంవత్సరం ఆగష్టు 6న జన్మించారు.
బాగా చదువుకుని ఆర్థిక శాస్త్రంలో పి.హెచ్.డి చేసి కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పని చేశారన్నారు.
తెలంగాణ తొలిదశ ఉద్యమంలో విద్యార్థి నాయకునిగా మలి దశ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణకు నీల్లు, నిధులు, నియమాకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ అందరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. జీవితాంతం అన్యాయాన్ని ప్రశ్నించి పేద ప్రజల తరపున ఉద్యమించిన ఆయన 2011వ సంవత్సరం, జూన్ 21 న అమరుడైనారు. ఆయన పేరున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి, వారికి నాణ్యమైన విద్యను అందించడానికి, విద్య ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ని ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Tuesday, 29 July 2025
RBSK team visit and screen all the students and give medicine at MPPS Uppununthala Boys
ఈ రోజు ఉదయం 11 గం.లకు రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమంల(RBSK) లో భాగంగా డాక్టర్ మంగ, డాక్టర్ మహేశ్వర్, ఫార్మసిస్ట్ రాజు, ఏ.ఎన్,యం రేణమ్మ లు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలను సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరిగింది. వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటానికి పాలు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, ఆకు కూరలు, మాంసం, చిరు ధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పాఠశాల, ఇల్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆటలు ఆడాలని తద్వారా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో కూడా రాణిస్తారు అని తెలియజేశారు. వైద్య సిబ్బందికి ఉపాధ్యాయులు, విద్యార్థులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Saturday, 19 July 2025
Shoes and School Bags free distribution by Maryada Foundation 2025 at MPPS Uppununthala Boys
విద్యార్థులకు బూట్లు & స్కూల్ బ్యాగ్ ల పంపిణీ:
ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు, ఉదయం 11 గం.లకు బాలికల ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు మర్యాద ఫౌండేషన్ తరపున ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారు బూట్లు, స్కూల్ బ్యాగ్ లు అతిథులతో కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అతిథులుగా హాజరైన మండల నాయకులు అనంత రెడ్డి గారు, ఎం.ఈ.వో చంద్రశేఖర్ గారు, కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ఉప్పునుంతల గ్రామానికి చెందిన మర్యాద ఫౌండేషన్ వ్యవస్థాపకులు మర్యాద రుక్మ రెడ్డి గారు మన గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి అమెరికాలో స్థిరపడ్డారు. విద్య ద్వారానే మెరుగైన జీవితాన్ని పొందొచ్చని తాను చదువుకున్న పాఠశాలకు, గ్రామానికి సహాయ సహకారాలు అందించాలని పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా విద్యార్థులకు 70 వేలతో 166 జతల బూట్లు, 70 స్కూల్ బ్యాగ్ లను ఉచితంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అందజేయడం ప్రశంసనీయం అని వారి సేవలను అభినందించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మర్యాద ఫౌండేషన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, బిచ్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, యువ నాయకులు భాస్కర్, రామచంద్రయ్య, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత రామచంద్ర రెడ్డి, లక్ష్మీ, జయప్రద, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
మర్యాద ఫౌండేషన్ వారు ఉచితంగా పంపిణీ చేసిన బూట్లు & స్కూల్ బ్యాగ్ లతో విద్యార్థులు
మర్యాద ఫౌండేషన్ ప్రతినిధి మర్యాద కృష్ణ రెడ్డి గారిని అతిథులు, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేయడం జరిగింది.
Friday, 11 July 2025
Free Notebooks distribution 2025 at MPPS Uppununthala Boys
Thursday, 10 July 2025
Guru Purnima Celebrations 2025 at MPPS Uppununthala Boys
Tuesday, 8 July 2025
Parent Teacher Meeting on Parents as Partners at MPPS Uppununthala Boys
ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి తెలియజేస్తూ సహ పాఠ్య కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణ, అభివృద్ధి సంబంధించిన పనులలో, మీ వృత్తికి సంబంధించిన విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. అదేవిధంగా ఇంటి వద్ద విద్యార్థులు చదువుకోవడానికి అనువైన గాలి వెలుతురు వచ్చేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయాలని, టీవీ, మొబైల్ వంటి శబ్దాలు రాకుండా చూడాలని, అక్కడ వారు చదువుకోవడానికి, ఇంటి పని పూర్తి చేయడానికి ప్రోత్సహించాలని వివరించారు. విద్యార్థులు నేర్చుకున్న సామర్థ్యాల సాధన కోసం ఇంటింటా చదువుల పంట యాప్ ని ఉపయోగించాలన్నారు. ఏఐ ఆధారిత ఏ.ఎక్స్.ఎల్ డిజిటల్ లెర్నింగ్ గురించి వివరించారు.
ముఖ్య అతిథులుగా హాజరైన సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మన పిల్లల భవిష్యత్తు కోసం నెలకు ఒక రోజు నిర్వహించే ఈ సమావేశంలో తల్లిదండ్రులు అందరూ పాల్గొని వారి ప్రగతిని తెలుసుకొని పాఠశాల అభివృద్ధికి, ఉపాధ్యాయులకు సహకరించాలని కోరారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల కంటే ఈ పాఠశాలలో బాగా చదవు చెప్తున్నారని, విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.
Friday, 20 June 2025
11th International Yoga Day Celebrations at MPPS Uppununthala Boys
ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ యోగా ప్రత్యేకతను, ప్రయోజనాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015 సంవత్సరం నుండి జరుపుకుంటున్నారని తెలియజేశారు. యోగాసనాలు అంటే వ్యాయామంలో ఉండే వివిధ రకాల భంగిమలనే యోగాసనాలు అంటారని, ఇవి చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా తయారవుతామని, ఎలాంటి జబ్బులు దరిచేరవని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తామని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించబడి, అభ్యసన మెరుగుపడుతుందని, నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అందుకే ప్రతిరోజు విద్యార్థులతో 5 నిమిషాలు ప్రార్థనా సమయం ముందు యోగాసనాలు, ప్రార్థన అనంతరం ధ్యానం చేయించడం జరుగుతుందని తెలిపారు.
Thursday, 19 June 2025
Sports Day Celebrations at MPPS Uppununthala Boys in the part of Pro Jayashankar Badi Bata programme
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులను జుట్లుగా చేసి కబడ్డీ, క్రికెట్, క్యారం బోర్డ్, తాడాట ఆటలు ఆడించడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు , ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన సంగీత లు మాట్లాడుతూ ఆటలు ఆడటం ద్వారా విద్యార్థుల్లో శారీరక ఎదుగుదలతో పాటుగా మానసికంగాను ఆనందంగా, ఉత్సాహంగా ఉంటూ చురుకుదనం పొంపొందుతందన్నారు. అదేవిధంగా పోటీతత్వం, సమిష్టి బాధ్యత, నాయకత్వ లక్షణాలు, గెలుపు ఓటములను సమానంగా తీసుకునే క్రీడా స్పూర్తి, సమయ స్పూర్తి పెంపొందుతాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో కూడా రాణిస్తారు కాబట్టి పాఠశాలలో వారికి ఇష్టమైన ఆటలు ఆడించడం వల్ల విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తారని, వారికి క్రమశిక్షణ అలవడుతుంది, చెడు విషయాలకు దూరంగా ఉంటారని అన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆటలు ఆడటం పిల్లల హక్కు కాబట్టి వారిని ఆడుకోనివ్వాలన్నారు.
Wednesday, 18 June 2025
Awareness programme on AI based digital classes at MPPS Uppununthala Boys
Monday, 16 June 2025
FLN Quiz has been conducted at MPPS Uppununthala Boys in the part of Pro Jayashankar Badi Bata programme 2025
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు ఎఫ్.ఎల్.ఎన్ క్విజ్ నిర్వహించడం జరిగింది. ఈ క్విజ్ లో విద్యార్థులను ఐదు గ్రూపులుగా చేసి తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం మరియు జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది. విద్యార్థులందరూ ఈ క్విజ్ లో చాలా ఆసక్తిగా, చురుకుగా పాల్గొని సమాధానాలు చెప్పారు. ఈ క్విజ్ లో ఎక్కువ పాయింట్లు సాధించిన గ్రూపు సభ్యులు యశ్వంత్, అశ్విని, భాను ప్రసాద్, అఖిల్, మనస్వి, శ్రవణ్ కుమార్ లకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెన్నులు బహుమతులుగా అందజేసి అభినందనలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఈ క్విజ్ ల ద్వారా విద్యార్థుల్లో గెలవాలనే పోటీతత్వం, పట్టుదల, విషయ పరిజ్ఞానం, నేర్చుకోవాలనే ఆసక్తి, సమిష్టి కృషి మొదలైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. మిగతా విద్యార్థులు తర్వాత చేపట్టబోయే క్విజ్ లో విజయం సాధించేలా బాగా చదవాలని సూచించారు.
Friday, 13 June 2025
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాసం 2025
Thursday, 12 June 2025
Welcoming students on reopening day in Grand PTM in the part of Pro Jayashankar Badi Bata programme 2025
పాఠశాల పునః ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు & విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ:
ఈ రోజు ఉదయం 9 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పాఠశాల పునః ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలను మామిడి తోరణాలతో అలంకరించడం జరిగింది, విద్యార్థులకు ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికి నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బడి ఈడు పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించడం గురించి చర్చించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో అర్థవంతమైన కృత్యాధార భోధనతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరడం జరిగింది. అతిథులుగా హాజరైన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వర్క్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని అందుకు నిదర్శనం 49 గురుకుల సీట్లు సాధించడమే అన్నారు. కాబట్టి గ్రామ ప్రజలు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.Tuesday, 10 June 2025
Huge response for Door to door campaign for enrollment of school age children in our school MPPS Uppununthala Boys
ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి ఆద్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, ఇప్పటివరకు 49 గురుకుల సీట్లు సాధించడం, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, వెంకటేష్ సార్ బాబు ఇదే పాఠశాలలో చదువుతుండటం, FLN విధానంలో ఎస్సీఈఆర్టీ వారు రూపొందించిన పాఠ్య ప్రణాళికల ఆధారంగా బోధనోపకరణాలతో ఐదు రోజులు అర్థవంతమైన బోధన, ఒక రోజు మదింపు, ప్రతి రోజూ వర్క్ బుక్ అభ్యాసం, అభ్యసనంలో వెనుకబడిన విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ, కృత్రిమ మేధా ఆధారంగా విద్యాబోధన, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల, క్విజ్, స్పెల్ బీ కాంపిటీషన్స్, నో బ్యాగ్ డే, ప్రతి నెల ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశాలు, ప్రత్యేక దినోత్సవాల నిర్వహణ, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది. కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరడం జరిగింది. ఈ రోజు 20 మంది విద్యార్థులతో ఇప్పటి వరకు మొత్తం 80 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకువచ్చారు. ఈ ప్రచారంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Monday, 9 June 2025
Door to door campaign for enrollment of school age children in the part of Badi Bata programme 2025-26
ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ ఆలూరి అరుణలింగమయ్య గారి ఆద్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, భోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన, FLN విధానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం, కృత్రిమ మేధా ఆధారంగా విద్యాబోధన, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరడం జరిగింది. ఈ రోజు 25 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం జరిగింది. ఈ ప్రచారంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Pro Jayashankar Badi bata programme at fields 2025 for enrollment of school age children
ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, భోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన, FLN విధానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఏఐ ఆధారంగా విద్యాబోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది కాబట్టి మీ పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం జరిగింది. ఈ రోజు 15 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం జరిగింది.అనంతరం గాజుల వెంకటేష్ సమీప పంట పొలాలకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న తల్లిదండ్రులతో మాట్లాడి మా బాబు రాహుల్ ఈ బడిలోనే చదువుతున్నాడని, మీ పిల్లలను కూడా మన బడిలో చేర్పించాలని కోరడం జరిగింది.ఉపాధ్యాయులు చందన, సంగీత, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.