Tuesday, 10 June 2025

Huge response for Door to door campaign for enrollment of school age children in our school MPPS Uppununthala Boys

ఉప్పునుంతలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఇంటింటి ప్రచారానికి భారీ స్పందన:

ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి ఆద్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, ఇప్పటివరకు 49 గురుకుల సీట్లు సాధించడం, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, వెంకటేష్ సార్ బాబు ఇదే పాఠశాలలో చదువుతుండటం, FLN విధానంలో ఎస్సీఈఆర్టీ వారు రూపొందించిన పాఠ్య ప్రణాళికల ఆధారంగా బోధనోపకరణాలతో ఐదు రోజులు అర్థవంతమైన బోధన, ఒక రోజు మదింపు, ప్రతి రోజూ వర్క్ బుక్ అభ్యాసం, అభ్యసనంలో వెనుకబడిన విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ, కృత్రిమ మేధా ఆధారంగా విద్యాబోధన, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల, క్విజ్, స్పెల్ బీ కాంపిటీషన్స్, నో బ్యాగ్ డే, ప్రతి నెల ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశాలు, ప్రత్యేక దినోత్సవాల నిర్వహణ, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది. కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరడం జరిగింది. ఈ రోజు 20 మంది విద్యార్థులతో ఇప్పటి వరకు మొత్తం 80 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకువచ్చారు. ఈ ప్రచారంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment