బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాసం:
ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఆద్వర్యంలో ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ అక్షరాలు అనేవి ఏ భాషకైనా ప్రాథమికమైనవని, అక్షరాలతో పదాలు, వాక్యాలు, పేరాలు తయారు అవుతాయని అందుకే విద్యార్థులకు అక్షరాలను, వాటి శబ్దాలను అర్థవంతమైన కృత్యాధార పద్దతిలో ఆట పాటలతో నేర్పిస్తున్నామని, చదవడం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని, రాయడం ద్వారా భావ వ్యక్తీకరణ చేయొచ్చని, విద్య మనిషిని మహోన్నతుడిని చేస్తుందన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, యువజన నాయకులు మేడమోని భాస్కర్, మాజీ యంపిటిసి పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలన్నారు. విద్యార్థులకు పలకలు అందించిన ఆలూరి శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు చెవ్వ పద్మ, విద్యార్థుల తల్లిదండ్రులు బాజ కోటేశు, మస్కూరి మల్లేష్, పాత్కుల కొండలు, సున్నం కుర్మయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment