Friday, 6 June 2025

Grama Sabha at Uppununthala on the occasion of Pro Jayashankar Badi Bata programme







ఈ రోజు ఉదయం 9 గం.లకు ఉప్పునుంతల మండలం కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి నారుమోళ్ళ వెంకటేష్ గారి ఆద్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, ప్రతి సంవత్సరం విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలను గ్రామ ప్రజలకు ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పునుంతల రాజస్వ ప్రధానోపాధ్యాయులు& కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి సార్ వివరిస్తూ గత విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో మన పాఠశాల నుంచి 563 మార్కులతో ఎ.నందిని మండలంలో మొదటి ర్యాంకు సాధించిందని, 25 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించారని, 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానల్ లు, సుదీర్ఘ అనుభవం కలిగిన, విషయ నిపుణులు అయిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలియజేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్ లు, 2 జతల ఏకరూప దుస్తులు, రుచికరమైన మధ్యాహ్నం భోజనం అందిస్తుందన్నారు. బాలికల ప్రాథమిక పాఠశాల ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయులు బిచ్యా నాయక్ సార్, బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు భోధనోపకరణాలతో, కంప్యూటర్, ప్రొజెక్టర్, ట్యాబ్ , కృత్రిమ మేధాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన చేస్తున్నామని, కంప్యూటర్ విద్యను, స్పోకెన్ ఇంగ్లీష్, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో ప్రతి సంవత్సరం గురుకుల సీట్లు సాధిస్తున్నారని తెలియజేశారు. బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ గారు హాజరైన వారందరితో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తమ వంతు కృషి చేస్తామని బడిబాట ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, యువకులు ఆలూరి వెంకటేష్ లు మాట్లాడుతూ మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేస్తున్నారని విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం అన్నారు. పంచాయతీ కార్యదర్శి పాఠశాలల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వక్తి గత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. మూడు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

0 comments:

Post a Comment