Friday, 4 April 2025
Congratulations to students who got gurukula seats in V TGCET 2025 Results
Thursday, 18 July 2024
Navodaya Classes Start at MPPS Uppununthala Boys
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నవోదయ తరగతులు ప్రారంభం:
నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యిందని, పరీక్ష జనవరి 18, 2025 న నిర్వహిస్తారని, ప్రస్తుతం విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, నవోదయ తరగతులు ఈ రోజు నుండి మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రారంభించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం తెలియజేశారు. అదేవిధంగా మన పాఠశాలలో సైనిక్ పాఠశాలల్లో, గురకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార బోధన చేస్తున్నామని, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని, విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వం కోసం అహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, బాలురకు హాస్టల్ వసతి ఉన్నందున ఈ గ్రామం విద్యార్థులతో పాటు, పరిసర గ్రామాల విద్యార్థులు మన పాఠశాలలో ప్రవేశం పొంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ తెలియజేశారు.
Tuesday, 23 April 2024
Congratulations to students who got 5th gurukula seats in V TGCET 2024
5వ తరగతి గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు: 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష 2024 ఫలితాల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల నుండి ఏడుగురు విద్యార్థులు ఆడేపు మురళి - అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, మస్కూరి అరవింద్ - లింగాల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో, బొల్లె ప్రవీణ, నడిగడ్డ వరలక్ష్మి, ఆలూరి పల్లవి, పొట్టల సిరి లకు బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మన్ననూర్ లో, మేకల అక్షర - వంగూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు విద్యార్థులను అభినందించడం జరిగింది. బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించడం జరిగింది. ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, మండల విద్యాశాఖ అధికారి రామారావు సార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, ఎఫ్.ఎల్.ఎన్ నోడల్ అధికారి చంద్రశేఖర్ సార్ లు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.
Friday, 9 February 2024
V TGCET 2024 Model test has been conducted at MPPS Uppununthala Boys
గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం మాదిరి పరీక్ష నిర్వహణ: రేపు ఉదయం 11 గం.లకు తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2024 (V TGCET 2024) నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సన్నద్దం కావడం కోసం బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్ విద్యార్థులకు పరీక్ష గురించి ప్రొజెక్టర్ పైన వివరించడం జరిగింది. పరీక్ష రాసే విద్యార్థులు హాల్ టికెట్, బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను & పరీక్ష ప్యాడ్ తీసుకుని ఒక గంట ముందే అనగా ఉదయం 10 గం.లకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. విద్యార్థులు ఓఎంఆర్ షీట్ లో ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న నాలుగు ఆప్షన్ లలో సరైన సమాధానం ఉన్న వృత్తాన్ని పెన్నుతో నల్లగా దిద్దాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు అభ్యాసం కోసం మాదిరి ప్రశ్నాపత్రం&ఓఎంఆర్ షీట్ లను ఇచ్చి మాదిరి పరీక్షను నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్, పద్మావతి మేడం లు పాల్గొన్నారు. విద్యార్థులు పరీక్ష బాగా రాసి సీట్లు సాధించాలని ఆకాంక్షించారు.
ప్రొజెక్టర్ పైన విద్యార్థులకు V TGCET 2024 పరీక్ష గురించి వివరిస్తున్న Tr. గాజుల వెంకటేష్ సార్.
Saturday, 23 December 2023
Navodaya and Gurukula Schools Entrance study material distribution by Saidulu Emmadi, Soft. Emp
విద్యార్థులకు నవోదయ, గురుకుల స్టడీ మెటీరియల్ పంపిణీ:ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల 4వ తరగతి విద్యార్థులకు గురుకుల స్టడీ మెటీరియల్, 5వ తరగతి విద్యార్థులకు నవోదయ స్టడీ మెటీరియల్ లను మహదేవ్ పూర్ గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు తన మాతృ మూర్తి సరస్వతమ్మ గారితో కలిసి అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో దాత సైదులు గారు మాట్లాడుతూ తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఈ స్థాయికి చేరుకున్న కాబట్టి పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఉపయోగపడే ఈ స్టడీ మెటీరియల్ అందిస్తున్నాను. కాబట్టి విద్యార్థులు వీటిని ఉపయోగించుకొని నవోదయ, గురుకుల సీట్లు సాధించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని మీరు కూడా పేద వారికి సహాయం చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, పద్మావతి మేడంలు, విద్యార్థులు దాత సైదులు గారికి, సరస్వతమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. దాతలను శాలువాతో ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో PHD స్కాలర్ మహదేవ్,కుర్మయ్య, పరిమేష్ పాల్గొన్నారు.