గురుకుల ఫలితాల్లో సత్తా చాటిన బాలుర ప్రాథమిక పాఠశాల విద్యార్థులు:
5వ తరగతి గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష 2025 మొదటి విడత ఫలితాల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల నుండి ఐదుగురు విద్యార్థులు ఆలూరి అక్షర, బొల్లె తన్వి లకు బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మన్ననూర్ లో, ఆలూరి పూజిత - సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల వంగూర్ లో, ఎదురిశెట్టి కీర్తన - మహాత్మా జ్యోతిబాఫూలే బి.సీ గురుకుల పాఠశాల మక్తల్ లో, ఇప్పటి భవ్య శ్రీ - సాధారణ గురుకుల పాఠశాల బోరబండలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం, సంగీత మేడంలు విద్యార్థులను అభినందించడం జరిగింది. బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ సార్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్ లు ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.
0 comments:
Post a Comment