ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 198వ జయంతి కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పూలే గారి చిత్ర పటానికి పూలతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెంకటేష్, చందన, సంగీత లు జ్యోతిరావు ఫూలే గారి గురించి విద్యార్థులకు వివరిస్తూ వారు అందరికీ విద్యను అందించడానికి తన బార్య సావిత్రి భాయి ఫూలేతో కలిసి 1848 వ సంవత్సరంలో బాలికల కోసం, సమాజంలోని నిమ్న వర్గాల కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే 52 పాఠశాలలు స్థాపించి విద్యా వ్యాప్తికి కృషి చేసిన విద్యా వేత్త అని, 1873 సంవత్సరంలో సత్యశోధక సమాజ్ ను స్థాపించి లింగ వివక్షతకు, కుల వివక్షతకు, సమాజంలోని అసమానతలకు, బాల్య వివాహాలకు, సతీసహగమనం కు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన సామాజిక విప్లవకారులు అని వారి సేవలను కొనియాడారు. వారిని స్పూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
0 comments:
Post a Comment