బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నవోదయ తరగతులు ప్రారంభం:
నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యిందని, పరీక్ష జనవరి 18, 2025 న నిర్వహిస్తారని, ప్రస్తుతం విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, నవోదయ తరగతులు ఈ రోజు నుండి మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రారంభించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం తెలియజేశారు. అదేవిధంగా మన పాఠశాలలో సైనిక్ పాఠశాలల్లో, గురకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార బోధన చేస్తున్నామని, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని, విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వం కోసం అహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, బాలురకు హాస్టల్ వసతి ఉన్నందున ఈ గ్రామం విద్యార్థులతో పాటు, పరిసర గ్రామాల విద్యార్థులు మన పాఠశాలలో ప్రవేశం పొంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ తెలియజేశారు.
0 comments:
Post a Comment