Friday, 12 July 2024

Teacher's Farewell and Welcome Programme at MPPS Uppununthala Boys

 

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు మరియు స్వాగతం కార్యక్రమం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఆత్మీయ వీడ్కోలు మరియు స్వాగతం కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి సార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ అరుణ గారు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి మరియు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేసి బదిలీ పైన వెళ్లిన ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ ను, ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, పద్మావతి మేడం లను శాలువాలతో, పూల దండలతో అతిథులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడుతూ నాణ్యమైన విద్య అందించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 20 నుంచి 81 కి పెంచడం జరిగిందని వివరించారు. అదేవిధంగా వారి స్థానంలో బదిలీ పైన పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, ఉపాధ్యాయురాలు చందన మేడం లను శాలువాలతో, పూల దండలతో సన్మానించి సాదరంగా స్వాగతం పలికారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, గ్రామ పెద్దలు పాత్కుల రామచంద్రయ్య గారు, డి.టి.ఎఫ్ నాయకులు రామస్వామి సార్, సమీప పాఠశాలల ఉపాధ్యాయులు జానకి రాములు సార్, శ్రీనివాసులు సార్, విద్యార్థుల తల్లిదండ్రులు బొల్లె పర్వతాలు, ఆలూరి వెంకటేష్, కాలూరి భారతి, భాజ అనిత, ఆలూరి సుహాసిని, మధనాగుల కవిత మరియు విద్యార్థులు పాల్గొని సన్మానించారు.

0 comments:

Post a Comment