ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ను మండల విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ గారు సందర్శించారు. ఇందులో భాగంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలను పరిశీలించారు. విద్యార్థుల చేత తెలుగు, ఇంగ్లీష్ చదివించారు, గణితం లోని చదుర్విద ప్రక్రియలను చేయించారు. స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలు ప్రదర్శించిన నాలుగవ తరగతి విద్యార్థులు పాత్కుల రిషిత్ కుమార్, ఆలూరి చంటి, ఐదవ తరగతి విద్యార్థి ఎదురిశెట్టి వరుణ్ తేజ్ లను అభినందించారు. 10వ తరగతి విద్యార్థులు కూడా చెప్పలేని విధంగా ఈ 4,5 తరగతుల విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ ను చాలా సులభంగా, ధారాళంగా చెప్తున్నారని, ఈ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లను అభినందించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లక్ష్యం ఏర్పాటు చేసుకొని దాని సాధనకు కృషి చేయాలని సూచించారు. పాఠశాల రిజిస్టర్ లు, రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి తమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయ పోస్టు ఖాళీ ఉన్నందున మరొక ఉపాధ్యాయున్ని కేటాయించాలని ఎం.ఈ.వో గారిని కోరడం జరిగింది.
0 comments:
Post a Comment