జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసిన డాక్టర్ స్వప్న:
ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వైద్య అధికారి స్వప్న గారు కార్యక్రమం ఉద్దేశ్యాన్ని విద్యార్థులకు వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే నులిపురుగులు వ్యాపిస్తాయి. కలుషిత ఆహారము, ఈగలు వాలిన తినుబండారాలు దుమ్ము, ధూళి పడిన పదార్థాలు తినడం వల్ల, బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన ద్వారా, కాళ్ళకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లడం ద్వారా, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరుకులు, శుభ్రమైన నీటితో కడగకపోవడం వలన వ్యాప్తి చెందుతాయి. ఇసుకలో చెప్పులు లేకుండా నడవడం, మురికి నీరుకి దగ్గర్లో ఉండటం, ఇన్ఫెక్షన్ ఉన్న ఆహారం తినడం, అపరిశుభ్ర పానీయాలు తాగడం వంటి వాటి వలన కూడా ఇవి సోకుతాయి. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా వుండుట వల్ల పిల్లలు అందులో ఆడుకొనుట వల్ల అందులోని నులిపురుగులు వాటి లార్వాలు జీర్ణకోశంలోనికి ప్రవేశించడం వలన వ్యాప్తి చెందుతాయి. కావున చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లు పెరిగినప్పుడు వాటిని కత్తిరించుకోవాలి బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయడం వల్ల నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. భోజనం చేసేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. జంక్ ఫుడ్ తినొద్దని, తాజ ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్లు, చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో రాణిస్తారు కాబట్టి ఈ జాగ్రత్తలు విద్యార్థులు అందరూ పాటించాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి, హెల్త్ అసిస్టెంట్ డి. శ్రీనివాసులు, ఎ.ఎన్.ఎంలు దేవి, వీణ, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment