ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు ఎఫ్.ఎల్.ఎన్ క్విజ్ నిర్వహించడం జరిగింది. ఈ క్విజ్ లో విద్యార్థులను ఐదు గ్రూపులుగా చేసి తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం మరియు జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది. విద్యార్థులందరూ ఈ క్విజ్ లో చాలా ఆసక్తిగా, చురుకుగా పాల్గొని సమాధానాలు చెప్పారు. ఈ క్విజ్ లో ఎక్కువ పాయింట్లు సాధించిన గ్రూపు సభ్యులు యశ్వంత్, అశ్విని, భాను ప్రసాద్, అఖిల్, మనస్వి, శ్రవణ్ కుమార్ లకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెన్నులు బహుమతులుగా అందజేసి అభినందనలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఈ క్విజ్ ల ద్వారా విద్యార్థుల్లో గెలవాలనే పోటీతత్వం, పట్టుదల, విషయ పరిజ్ఞానం, నేర్చుకోవాలనే ఆసక్తి, సమిష్టి కృషి మొదలైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. మిగతా విద్యార్థులు తర్వాత చేపట్టబోయే క్విజ్ లో విజయం సాధించేలా బాగా చదవాలని సూచించారు.
0 comments:
Post a Comment