BPS ఉప్పునుంతల విద్యార్థులకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలను పంపిణీ చేసిన మేకల రామచంద్రయ్య: పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కట్ట సరిత మేడం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5వ తరగతి విద్యార్థులు పాఠశాలతో, ఉపాధ్యాయులతో, విద్యార్థులతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సర్పంచ్ మేడం, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, దాత రామచంద్రయ్య గారు, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పేద కుటుంబంలో జన్మించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని పట్టుదలతో బాగా చదువుకొని ప్రపంచ మేధావిగా ఖ్యాతి గడించారని, రాజ్యాంగ రచన ద్వారా అందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించారని ఆయన జీవిత చరిత్ర పుస్తకం చదివి స్పూర్తి పొంది మీరు కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలను, పెన్నులు,పెన్ను బాక్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ భాస్కర్, నిరంజన్,శేఖర్, మల్లేష్, స్వామి, పరమేశ్ రామస్వామి, తిరుపతయ్య పాల్గొన్నారు.
0 comments:
Post a Comment