తేది. 19-08-2023 ఉదయం 10 గం.లకు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం (Parent Teacher Meeting) లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు, PU ప్రొఫెసర్ మోటమారి మధు గారు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలకు 30వేల రూపాయలతో 2 కంప్యూటర్లను విరాళంగా అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు దాతలను ఘనంగా శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు. కాంప్లెక్స్ హెచ్ఎం హన్మంతు రెడ్డి సార్, హెచ్ఎం లక్ష్మీ నారాయణ సార్, బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండే కంప్యూటర్ విద్యను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. దాతలు సైదులు గారు, మధు గారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని, అందుకే పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా పాఠశాలకు కంప్యూటర్లను ఇస్తున్నామని, తాము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయికి చేరుకొన్నామని విద్యార్థులు కూడా విద్యను నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ఈ సమావేశంలో సైదులు గారి శ్రీమతి భారతి గారు, పి.హెచ్.డి స్కాలర్ మహదేవ్ గారు, లక్ష్మణ్ గారు, శ్రీను గారు, మల్లేష్ గారు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment