కవి గిడుగు రామమూర్తి జన్మ దినం సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గం.లకు మాతృ భాష దినోత్సవం/తెలుగు భాష దినోత్సవాన్ని మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు పద్యాల పోటీ, గేయాల పోటీ నిర్వహించడం జరిగింది.ప్రతిభ కనబరిచి విజేతలు నిలిచిన ప్రవీణ, సిరి, తన్వి, అలేఖ్య, రాహుల్, తేజ శ్రీ లకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మన మాతృభాష తెలుగు గొప్పతనం గురించి మాట్లాడుతూ అమ్మ ఒళ్ళో ఉన్నప్పటి బాల్యం నుంచే మనం తెలుగును నేర్చుకోవడం జరుగుతుంది అని అందుకే మనకు మాతృభాష లోనే ఏ విషయాన్ని అయినా చాలా సులువుగా అవగాహన చేసుకుంటాము. ఆప్యాయతలు, అనురాగాలు, అనుబంధాలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని మాతృ భాషతో అనుసంధానం అయి ఉంటాయి. కాబట్టి మాతృ భాషపై పట్టు సాధిస్తేనే ఇతర ఇంగ్లీష్, హిందీ వంటి భాషలను సులభంగా నేర్చుకోగలము. కాబట్టి విద్యార్థులు అందరూ తెలుగు పాఠ్య పుస్తకాలను, గ్రంథాలయంలోని పుస్తకాలను చదివి తెలుగు భాషలోని వ్యాకరణం, పద్యాలు, గేయాలు, పాటలు, నీతి కథలు, కవితలు చదివి తెలుగు భాషపై పట్టు సాధించాలి అని విద్యార్థులకు సూచించారు.
0 comments:
Post a Comment