ఈ రోజు మధ్యాహ్నం 1గం.లకు సాఫ్ట్వేర్ ఉద్యోగి మహదేవ్ పూర్ గ్రామానికి చెందిన ఇమ్మడి సైదులు గారు తన భార్య భారతి, మిత్రుడు మహదేవ్ సమక్షంలో BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలకు 15వేల రూపాయల కలర్ ప్రింటర్ ను విరాళంగా అందజేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు వారిని ఘనంగా శాలువాతో సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ విద్యార్థులకు, పాఠశాలకు ఎంతో ఉపయోగపడే కలర్ ప్రింటర్ ను విరాళంగా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రింటర్ దాత సైదులు గారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉపాధ్యాయులు అందిస్తున్నారని, అందుకే పే బ్యాక్ టు ది సొసైటీ లో భాగంగా పాఠశాలకు ఇప్పుడు ప్రింటర్ ఇస్తున్నానని, అతి త్వరలో కంప్యూటర్ ల్యాబ్ కోసం ఒక కంప్యూటర్ ను తన వంతు గా ఇస్తానని తెలియజేశారు. అదేవిధంగా 15 సెట్స్ నవోదయ బుక్స్ కూడా ఇస్తానని తెలియజేశారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఎన్నో సమస్యల్ని అధిగమించి ఈ స్థాయికి చేరుకొన్నానని విద్యార్థులు కూడా ఎన్ని సమస్యలు ఉన్నా విద్యను నిర్లక్ష్యం చేయకుండా భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
నారుమొళ్ళ మహదేవ్ P.HD స్కాలర్ గారు మాట్లాడుతూ తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇప్పుడు జర్నలిజంలో PHD చేస్తున్నాను. ఈ పాఠశాలలో గురుకుల, నవోదయ పాఠశాలల ప్రవేశం కోసం ప్రత్యేక తరగతులు, డిజిటల్ బోధన, స్పోకెన్ ఇంగ్లీష్, టైపింగ్, కంప్యూటర్ విద్య, చిల్డ్రన్ బ్యాంకు లాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను ఉపాధ్యాయులు చేస్తున్నారు కాబట్టి విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సాయిని శ్రీనివాస్ గారు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలూరి వెంకటేష్ గారు, మధనాగుల ఆంజనేయులు గారు, అంపటి తిరుపతయ్య గారు, కాలూరి భారతి గారు,కె. రవికుమార్ గారు, పాత్కల నరేష్ గారు, బూర్సుల శీను గారు, పాత్కూల రాంప్రసాద్ గారు, మేడమోని చిన్న జంగయ్య గారు, ch. మల్లేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment