బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహణ:
ఈ రోజు ఫిబ్రవరి 25, 2023 న బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గా గౌతమ్, DEO గా వెంకటేష్, MEO గా శివకృష్ణ, HM గా భార్గవి లు ఇలా మొత్తం 25 విద్యార్థులు ఛాత్రోపాధ్యాలుగా వ్యవహరించారు. స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు చాలా అందంగా తయారయ్యి వచ్చి చాలా బాగా పాటాలు బోధించారు. గ్రామ సర్పంచ్ కట్ట సరిత మేడం గారు, పెద్దలు కట్టా అనంత రెడ్డి సార్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హన్మంతు రెడ్డి సార్, DTF రాష్ట్ర నాయకులు రామస్వామి సార్, SMC చైర్మన్ రాములు సార్, విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి విద్యార్థుల ప్రతిభాపాటవాలను తిలకించి వారిని అభినందించి, ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేడం మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, విజయ్ కుమార్ సార్ లు మాట్లాడుతూ అనుభవాన్ని మించిన అభ్యసనం లేదని మీరు ఈ రోజు స్వయంగా పాఠాలు బోధించి ఆ అనుభవాన్ని, అనుభూతి పొందారు. ఛాత్రోపాధ్యాయులుగా మీకు దక్కిన గౌరవం, అనుభూతి శాశ్వతంగా పొందాలంటే విద్యార్థులు ఏ రోజు చెప్పింది ఆ రోజు శ్రద్ధగా చదువుకోవాలని నేర్చుకొన్న విషయాలను నిజ జీవితంలో ఉపయోగించుకోవాలని సూచించారు. చదువు ఒక్కటే మన పేదరికం, అజ్ఞానం నుంచి విముక్తి ఇస్తుందని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఛాత్రోపాధ్యాయుల బోధనను పరిశీలిస్తున్న సర్పంచ్ మేడం, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్
సర్పంచ్ కట్ట సరిత మేడం గారితో విద్యార్థులకు బహుమతుల ప్రదానం
DTF ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు రామస్వామి సార్ తో విద్యార్థులకు బహుమతుల ప్రదానం
0 comments:
Post a Comment