ఫిబ్రవరి 10,2023న మధ్యాహ్నం 2 గం.లకు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను 5 గ్రూపులుగా చేసి ఆంగ్ల పదాల స్పెల్లింగ్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో విజయం సాధించిన అంపటి భార్గవి గ్రూప్ సభ్యులకి పెన్నులు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించి, అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత కోర్సులు చేసి, ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఆంగ్ల భాష పై పట్టు సాధించాలన్నారు. అందుకోసం ఆంగ్ల పదజాలం అభివృద్ధి పరుచుకోవాలని దాని కోసం స్పెల్లింగ్ క్విజ్ కాంపిటీషన్ తోడ్పడుతుందని తెలియజేశారు. విద్యార్థులు అందరూ ఆంగ్ల పాఠ్య పుస్తకాల చివరి పేజిల్లో ఉన్న కామన్ వర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లను చదివి వాటి అర్థాలు తెలుసుకొని రోజూ వాటిని ఉపయోగిస్తుంటే మరిచిపోకుండా గుర్తుంచుకుంటారని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఇంగ్లీష్ మీడియంలోకి మారినందున ఇంగ్లీష్ భాష వస్తేనే మిగిలిన విషయాలు అవగాహన చేసుకుంటారు కాబట్టి విద్యార్థులు అందరూ ఆంగ్ల భాష పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
0 comments:
Post a Comment