బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: ఈ రోజు మధ్యాహ్నం 2 గం.లకు BPS ఉప్పునుంతల ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పద్యాల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో విజయం సాధించిన ప్రజ్వ, తేజ్ కుమార్, భార్గవి లకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహించి, అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ అమ్మ మనకు ఆది గురువు, అమ్మ నేర్పే భాషే మాతృభాష. పాఠశాలకు రాకముందే దీన్ని చాలా సహజసిద్ధంగా మన కుటుంబ సభ్యులను అనుకరిస్తూ నేర్చుకుంటాం. వినడం, మాట్లాడటం ఇంటి వద్దే నేర్చుకుంటే చదవడం, రాయడం వ్యాకరణ అంశాలు పాఠశాలలో నేర్చుకుంటాం. మాతృభాష మన సంస్కృతికి అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి దాన్ని పరిరక్షించుకుంటూనే ఇతర భాషలను నేర్చుకోవాలి. భాషా వికాసం జరిగినప్పుడే విషయావగాహన అవుతుంది. కాబట్టి మాతృభాష పై విద్యార్థులు పట్టు సాధించాలి. అప్పుడే ఇతర భాషలపై కూడా పట్టు సాధిస్తాం. విద్యార్థులు మాతృ భాషలో పుస్తకాలు చదవాలి, కవితలు, పాటలు, గేయాలు, కథలు, నాటికలు రాయాలి, వాటిని ప్రదర్శించాలని తెలియజేశారు.
0 comments:
Post a Comment