Monday, 11 October 2021

PS Uppununthala Boys Success Story | ప్రగతి పథంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల

ప్రగతి పథంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల

పాఠశాల పేరు: బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల

మండలం పేరు: ఉప్పునుంతల

జిల్లా పేరు: నాగర్ కర్నూల్ ; మొబైల్ నెంబరు : 7989970120 

ఈమెయిల్ : psuppununthalaboys@gmail.com 

యూట్యూబ్ ఛానల్: https://youtube.com/channel/UC4oph1xU4nm70EmZEtMY2HA

బ్లాగు : http://psuppununthalaboys.blogspot.com

పాఠశాల లోగో:

 


కె. లక్ష్మీనారాయణ, HM

జి. బాలమ్మ, SGT 

జి. వెంకటేష్, SGT


విజయ రహస్యం : సమిష్టి కృషి 

మేము ముగ్గురం 2018 జూలై 11న ఈ పాఠశాలకు బదిలీ పై రావడం జరిగింది. అప్పుడు విద్యార్థుల సంఖ్య 31. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు అన్ని రంగులు పోయి అందవికారంగా ఉన్నవి. రాయడానికి సరిగ్గా నల్లబల్లలు లేవు. అన్ని గదులకు కరెంటు, ఫ్యాన్ లు లేవు. పాఠశాల పరిసరాలు దోమలు, ఈగలతో ఇబ్బందికరంగా ఉండినది. 

నాడు పాఠశాల పరిస్థితి:


పాఠశాల పరిస్థితులను, విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయుల సమీక్ష సమావేశం నిర్వహించుకుని అందులో ఎస్ఎంసి సహకారంతో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పాఠశాలకు కావలసిన వనరులను సమకూర్చుకోవాలి అని, విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి వారికి గురుకుల సీట్లు వచ్చే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. 

తర్వాత ఎస్ఎంసి సమావేశం నిర్వహించి ఈ పరిస్థితుల గురించి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి చేపట్టబోయే కార్యక్రమాలను గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రజాప్రతినిధులకు వివరించడం జరిగింది. 


ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు బాలికలను కూడా పాఠశాలలో చేర్చుకోవడం, 1వ తరగతి నుండి ఇంగ్లీషు మీడియం ప్రారంభించడం జరిగింది. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మూర్త భావనలు మాత్రమే అర్థం అవుతాయి కాబట్టి వారికి పాఠ్యాంశాలను కృత్యాల ద్వారా విద్యార్థులను గ్రూపులుగా చేసి బోధనాభ్యసన సామగ్రి ఉపయోగించి బోధించడం జరుగుతుంది. 































































































కృత్యాధార బోధన వల్ల విద్యార్థులు విషయాలలోని వివిధ భావనలను సులువుగా అవగాహన చేసుకుంటున్నారు.

మా ఇంటి వద్ద ఉన్న కంప్యూటర్ ని పాఠశాలకు తీసుకువచ్చి విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడం జరుగుతుంది. 

విద్యార్థులకు ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను కూడా నిర్వహించడం జరుగుతుంది. 























విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా TLM ఉపయోగించడంతో పాటు డిజిటల్ వీడియో పాఠాలతో బోధన చేస్తున్నాము.

సులభంగా తెలుగు వర్ణమాల నేర్పడం:

https://youtu.be/ja-RiMeq5Wo

సులభంగా గుణింతాలు నేర్పడం:

https://youtu.be/N-tij2afwRw

సులభంగా సంఖ్యలు నేర్పడం:

Numbers Rhyme:

https://youtu.be/7BBHrQ8mwSA

పాచికతో ఆడుతూ అంకెలు నేర్చుకోవడం:

https://youtu.be/5q7AiE9HlJc

అంకెలు ఎలా లెక్కించాలి:

https://youtu.be/QotC9Wft6Eo

అంకెలు ఎలా రాయాలి:

https://youtu.be/SkjxsYPwj3w

Numbers Introduction with sticks:

https://youtu.be/gaVkNefLkCw

Learn Numbers with Abacus:

https://youtu.be/1AWoRl7DFvA

పూసల దండ ఉపయోగించి సంఖ్యలు నేర్పడం :

https://youtu.be/q9KvC8kmEBM

ఇచ్చిన అంకెలతో సంఖ్యలు ఏర్పరచడం:

https://youtu.be/_naytgl9q5Y

ఇచ్చిన అంకెలతో ఏర్పడు మిక్కిలి పెద్ద సంఖ్య,మిక్కిలి చిన్న సంఖ్యలు రాయడం:

https://youtu.be/gyUBlNBe0QQ

సులభంగా ఎక్కాలు నేర్పడం:

https://youtu.be/tVFQRy_tuwA

చేతి వేళ్ళతో 9వ ఎక్కం:

https://youtu.be/iGiIG8xowCM

9th Table Tricks:

https://youtu.be/41yhC4eyx3Y

19వ ఎక్కం సులభంగా గుర్తించుకోవడం:

https://youtu.be/chuUxzzYR2Q

100 వరకు ఎక్కాలు సులభంగా చెప్పడం:

https://youtu.be/QNkdvSBwH3o

సులభంగా English Alphabet నేర్పడం:

Alphabet Song:

https://youtu.be/ML_FVIFERZM

Alphabetical Words:

https://youtu.be/dr0q_JbC_wM

How to write Alphabet:

https://youtu.be/vDKOnnlHBGQ

Fruits Name:

https://youtu.be/v29NIaqlsvo

How to make Digital Lessons with Power Point Slides on mobile:

https://youtu.be/LuIp-zQHnEU

1వ తరగతి తెలుగు 1వ పాఠం తబల డిజిటల్ పాఠం:

మొదటి భాగం:

https://youtu.be/SSNNXvRjIAo

రెండవ భాగం:

https://youtu.be/5fCjkIvdaTI

12 Tenses in 6 minutes:

https://youtu.be/eIE6zfTICxc

అదేవిధంగా నాలుగవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష తరగతులను నిర్వహించడం జరిగింది. తద్వారా 2019 సంవత్సరం గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన ఐదుగురిలో నలుగురికి సీట్లు రావడం జరిగింది. 


ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ పాఠశాలకు మౌలిక వసతులు కల్పించాలని, పిల్లల్ని మన పాఠశాలలో చేర్పించాలని కోరడం జరిగింది. 




పాఠశాలకు రంగులు వేయించాలని సర్పంచి కట్టా సరితా మేడం గారిని పలు సార్లు కలవడం జరిగింది దాంతో వారు పాఠశాలకు రంగులు వేయించారు. వారికి ధన్యవాదాలు. 

నేడు పాఠశాల:



అదేవిధంగా పాఠశాల నిధులతో అన్ని తరగతి గదులకు కరెంటు వైరింగ్ చేయించడం జరిగింది, ఫ్యాన్ లు, చార్జింగ్ మైక్, గ్రీన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షలో సాధించిన ఫలితాలు, పాఠశాలలో కల్పించిన మౌలిక వసతులు తెలుసుకొని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను మన పాఠశాలలో చేర్పించడం జరిగింది. మా పాఠశాల ఉపాధ్యాయులు జి. వెంకటేశ్ సార్ వాళ్ళ బావ ఈ ఫలితాలు తెలుసుకొని తన కొడుకు వర ప్రసాద్ ని ప్రైవేటు పాఠశాల నుండి తీసి మన ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతిలో చేర్పించారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య 47కి చేరింది. 

ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తూనే విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి వారిని ఆటపాటలతో క్షేత్ర పర్యటనలు విహారయాత్రలకు కూడా తీసుకెళ్లడం జరిగింది. 







ఈ విద్యా సంవత్సరం కూడా గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగింది కానీ 2020 మార్చి నెల చివరలో కరోనా లాక్డౌన్ వల్ల పాఠశాలలకు సెలవులు ఇచ్చారు.

వీరి కోసం మా పాఠశాల ఉపాధ్యాయులు జి వెంకటేష్ సార్ యూట్యూబ్ ద్వారా గురుకుల ప్రవేశ పరీక్ష ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. 


V TGCET 2020లో నలుగురు విద్యార్థులను పరీక్ష రాపిస్తే అందులో ముగ్గురికి సీట్లు రావడం జరిగింది. 


నారాయణపేట గురుకులంలో సీటు పొందిన వరలక్ష్మినీ వారి తల్లిదండ్రులు నారాయణపేట దూరం ఉంది కాబట్టి ఆ గురుకుల పాఠశాలకు పంపియమని అంటున్నారని విద్యార్థి మాకు తెలియజేస్తే వారి ఇంటి దగ్గరికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేసి గురుకుల పాఠశాలలో చదువుకుంటే అమ్మాయి భవిష్యత్తు ఏ విధంగా బాగుపడుతుందో వివరించి వారిని ఒప్పించి గురుకుల పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది.



2020 - 21 విద్యా సంవత్సరం కరోనా వల్ల పాఠశాలలు తెరవకపోవడం వల్ల ప్రత్యక్ష తరగతులు నిర్వహించ లేకపోయాము. 

దూరదర్శన్ యాదగిరి ఛానల్ మరియు టీ సాట్ విద్య ఛానల్ ద్వారా విద్యాశాఖ ప్రసారం చేసే డిజిటల్ పాఠాలను విద్యార్థులందరూ చూసే విధంగా చర్యలు తీసుకొని వారిని పర్యవేక్షించడం జరిగింది. తరగతి వారిగా వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి అందులో ప్రతి రోజూ షెడ్యూల్ ని పంపించి విద్యార్థులు ప్రతి రోజు కచ్చితంగా చూసే విధంగా సూచనలు చేసేది. ఎవరైనా లైవ్ చూడనివారు ఉన్నాకూడా డిజిటల్ పాఠశాల యూట్యూబ్ లింకులు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసి వాటి ద్వారా విద్యార్థులు ఎప్పుడైనా ఎన్నిసార్లైనా డిజిటల్ పాఠాలు చూసే విధంగా వారికి అవగాహన కల్పించాము.






ఈ సంవత్సరం కూడా ప్రత్యక్ష తరగతులు లేకపోవడంవల్ల ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష కోసం మా పాఠశాల ఉపాధ్యాయులు జి వెంకటేష్ సార్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ద్వారా గురుకుల ఆన్లైన్ తరగతులు నిర్వహించడం జరిగింది.


మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ద్వారా 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష ఆన్లైన్ తరగతులు వింటున్న విద్యార్థులు:



V TGCET 2021లో మా పాఠశాల నుండి ఐదుగురిని పరీక్ష రాపిస్తే నలుగురికి సీట్లు రావడం జరిగింది వీరితో పాటు మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ద్వారా ఆన్లైన్ తరగతులు విన్న వారందరికీ 30 మందికి పైగా గురుకుల సీట్లు రావడం జరిగింది.



గురుకుల ఆన్లైన్ తరగతులపై తల్లిదండ్రుల స్పందన: https://youtu.be/hlwzKuiMiqc



కరోనా సమయంలో ఉపాధ్యాయులకు ఆన్లైన్ బోధనపై మా పాఠశాల ఉపాధ్యాయులు జి. వెంకటేష్ సార్ 5రోజుల శిక్షణ ఇచ్చారు. 




ఆన్లైన్ బోధన పై ఉపాధ్యాయులకు శిక్షణ పై నాగర్ కర్నూల్ జిల్లా ఏఎంఓ సతీష్ సార్ సందేశం :

వీడియో లింక్ : https://youtu.be/DFWAL2kbntY

ఆన్లైన్ బోధనపై శిక్షణ వీడియోలు(Online Digital Teaching Tools) : https://www.youtube.com/playlist?list=PLLC2MA6rGfS1rClhbw6a21zlb8IRSjesc

ఉపాధ్యాయుని స్పందన: https://youtu.be/6RHPbUw7968

కరోనా సమయంలో విద్యార్థులు 17 నెలలు పాఠశాలకు దూరం కావడం వల్ల ప్రాథమిక అంశాలు మర్చిపోయిన వారికి బేసిక్స్ నేర్పించుట కోసం ప్రాథమిక అంశాల అభ్యసన కార్యక్రమం / BLP ఆన్లైన్ తరగతులు మైక్రోసాఫ్ట్ టీమ్స్ యాప్ ద్వారా మా పాఠశాల ఉపాధ్యాయులు జి. వెంకటేష్ సార్ నిర్వహిస్తున్నారు. 

ఈ విద్యా సంవత్సరం(2021-22) లో మా పాఠశాల ఉపాధ్యాయులు జి. వెంకటేష్ సార్ తన కుమారుడు గౌతమ్ ను, అల్లుడు విద్యాసాగర్ ను 2021 జూన్ 30న మన పాఠశాలలో చేర్పించారు. 



 మా పాఠశాల ఉపాధ్యాయులు జి. వెంకటేష్ సార్ కరోనా సమయంలో విద్యార్థులకు విద్యను అందించేందుకు చేసిన వివిధ కార్యక్రమాలను ఉప్పునుంతల తహసిల్దార్ కృష్ణయ్య సార్ తెలుసుకొని తానే స్వయంగా పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జి. వెంకటేష్ సార్ ను అభినందించారు. 


ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను ఎందుకు చేర్పించాలి:

వీడియో లింక్ లు:

1) https://youtu.be/XD2UXC6rNIc

2) https://youtu.be/MfTFi3p9BPU

3) https://youtu.be/ewMyOkuXRiI

నాడు-నేడు వీడియో : https://youtu.be/wCrpFYrlT04

బడిబాట వీడియో : https://youtu.be/95xwXjh8c14

విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల వీడియో :

https://youtu.be/_nKwuS674r0

విద్యార్థులచే ఓటర్లను చైతన్యం చేసే వీడియో :

https://youtu.be/QgjloN6uu4k

బడిబాట పోస్టర్ :


విద్యార్థులను మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ప్రతి సంవత్సరం మన విద్యార్థులు సాధించిన ఫలితాలను, మన పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేష్ సార్ పిల్లలనే మా పాఠశాలలో చేర్పించడం గురించి వివరిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తామని హామి ఇస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించాము. 




తల్లిదండ్రులు మాపై నమ్మకంతో సుమారు 100 మంది విద్యార్థులను పాఠశాలలో కొత్తగా చేర్చడంతో ఇప్పుడు విద్యార్థుల సంఖ్య 133 కి చేరింది. ఇంకా ప్రవేశాలు జరుగుతున్నవి. 

పాఠశాల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయడం కోసం మౌలిక వసతుల మెరుగుపరచడం కోసం "ఇంటికి వంద బడికి చందా" అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇందులో ముందుగా ఉపాధ్యాయులందరం వెయ్యి రూపాయల చొప్పున పాఠశాలకు కోసం ఇచ్చాము. విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ఇచ్చేలా అవగాహన కల్పిస్తున్నాం. 


పాఠశాల ఉపాధ్యాయుడి జి. వెంకటేష్ సార్ కుమారుడు గౌతమ్ తన 8వ పుట్టిన రోజు సందర్భంగా తాను దాచుకొన్న రూ. 1000 లతో పాఠశాల విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్ లు, ఎరేసర్ లు, బలపాలు & ఇద్దరికి వీటితోపాటు నోటుపుస్తకాలు పంచారు. 


మహిళా దినోత్సవం & మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేస్తున్న కృషికి గాను మన పాఠశాల ఉపాధ్యాయురాలు జి. బాలమ్మ గారిని MEO & సోదర ఉపాధ్యాయులు సన్మానించడం జరిగింది.



పాఠశాల అభివృద్ధికి మరియు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేస్తున్న వివిధ కార్యక్రమాలకు గాను పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు అయినా నన్ను జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసి సన్మానించడం జరిగింది.




ఈ అవార్డు వల్ల మా పై మరింత బాధ్యత పెరిగింది.

పాఠశాల మరియు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి మరింత సమర్థవంతంగా అందరం సమన్వయంతో సమిష్టిగా కృషి చేస్తాము. 

ప్రస్తుతం విద్యార్థులకు 3R's కార్యక్రమం అమలు చేస్తున్నాము. 

ప్రారంభ పరీక్ష ద్వారా విద్యార్థుల స్థాయిని తెలుసుకొని వారి స్థాయికి అనుగుణంగా గ్రూపులు చేసి బోధన చేస్తున్నాము. 

ముగింపు :

మన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారందరూ పేద విద్యార్థులే. అంతేకాకుండా వారి తల్లిదండ్రులు చాలావరకు నిరక్షరాస్యులు. విద్య లేక వారు కూలిపని చేస్తూ పేదరికంలో బతుకుతున్నారు. వారు పేదరికం నుంచి బయటపడాలంటే ఒక తరానికి నాణ్యమైన విద్యను అందిస్తే ఆ తర్వాతి తరాలు అవే బాగుపడతాయి. కాబట్టి మన పాఠశాల విద్యార్థులందరికీ అందరి సహకారంతో నాణ్యమైన విద్యను అందిస్తూ వారి సర్వతోముఖాభివృద్ధికి ప్రయత్నిస్తున్నాం. 

విద్యార్థుల అభిప్రాయాలు:


నా పేరు పాత్కుల దామోదర్, నేను ఈ సంవత్సరమే ప్రైవేట్ పాఠశాల నుండి ఈ పాఠశాలలో చేరాను. నేను నాలుగో తరగతి చదువుతున్నాను. ఇక్కడ సార్ వాళ్లు మేడం చాలా ఓపికగా కొట్టకుండా, తిట్టకుండా అన్ని విషయాలు అర్థమయ్యేటట్లు చెబుతున్నారు. ఇక్కడ విద్యార్థులు అందరూ చాలా స్నేహంగా వుంటున్నారు. ఈ పాఠశాలలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. 


నా పేరు మాడ్గుల త్రివేణి, నేను ఐదో తరగతి చదువుతున్నాను. కరోనా సమయంలో కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహించడం వల్ల నేను గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో సీటు సాధించాను. నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ వాళ్లకు మేడంకు ధన్యవాదాలు. 

తల్లిదండ్రుల అభిప్రాయాలు:


నా పేరు పాత్కుల నిరంజన్, ఉప్పునుంతల గ్రా&మం, 

మా ఇంటి పక్కల ఉన్న పాఠశాలలో ఇంత బాగా చదువు చెప్తుంటే వేల రూపాయలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలకు పంపడం ఎందుకని మా ఇద్దరి పిల్లలను బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల లోనే చేర్పించాము. ఇప్పుడు పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. 


నా పేరు మిర్యాల జంగయ్య, ఉప్పునుంతల గ్రా&మం, 

మా ముగ్గురు పిల్లలు ఈ పాఠశాలల్లో చదువుతున్నారు. సార్ వాళ్ళు మేడం గురుకుల పరీక్ష కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల మా పెద్దమ్మాయికి పోయిన సంవత్సరం గురుకుల పాఠశాలలో సీటొచ్చింది చాలా సంతోషంగా ఉంది. 


నా పేరు చిక్కుడు రామచంద్రయ్య,ఉప్పునుంతల గ్రా&మం

సార్ వాళ్ళు మేడం ఈ పాఠశాలకు బదిలీపై వచ్చినప్పుడు వారిపై నమ్మకంతో మా ఇద్దరు బాబులను ప్రైవేట్ పాఠశాల నుండి తీసి ఈ పాఠశాలలో చేర్పించడం జరిగింది. పోయిన సంవత్సరం కరోనా వల్ల పాఠశాలలు మూతబడిన కూడా సార్ వాళ్ళు గురుకుల ఆన్లైన్ తరగతులు నిర్వహించడం వల్ల మా పెద్ద బాబుకు గురుకుల సీట్ వచ్చింది. వేల రూపాయలు పెట్టి ప్రైవేట్ లో చదివిన వారికి కూడా గురుకుల సీటు రావడం లేదు, మా బాబుకు రావడం చాలా సంతోషంగా ఉంది. 

0 comments:

Post a Comment