ఈ రోజు ప్రభుత్వ బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారు ఐదు వేల రూపాయలతో పంపించిన నవోదయ స్టడీ మెటీరియల్ ను విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు వెంకటేష్ సార్ లు అందజేశారు. కలర్ ప్రింటర్, నవోదయ స్టడీ మెటీరియల్ లను అందించడమే కాకుండా కంప్యూటర్ ల్యాబ్ కోసం ఒక కంప్యూటర్ ను కూడా అందజేస్తానని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇమ్మడి సైదులు గారికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నవోదయ విద్యాలయాల్లో సెంట్రల్ సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అన్ని కార్యక్రమాలు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఈ పాఠశాలల్లో చదువుకున్న ఎందరో విద్యార్థులు IAS,IPS లాంటి ఉన్నత స్థాయికి చేరుకోవడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఈ నవోదయ స్టడీ మెటీరియల్ ను సద్వినియోగం చేసుకొని సీటు సాధించి, భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొవాలని కోరారు.
0 comments:
Post a Comment