ఘనంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 93 జయంతి కార్యక్రమం:
ఈ రోజు మధ్యాహ్నం 3:30 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఎ.పి.జె అబ్దుల్ కలాం గారి 93 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు వెంకటేష్ , చందన అబ్దుల్ కలాం గారు భారత దేశానికి చేసిన సేవలను గురించి విద్యార్థులకు వివరిస్తూ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో పేద కుటుంబంలో జన్మించిన అతను కష్టపడి చదువుకొన్నాడు. వాళ్ళ నాన్న పడవ నడిపేవాడు కాని కుటుంబం గడవడం కృష్ణంగా ఉండేది దీనితో కలాం గారు చదువుకునేటప్పుడు పేపర్ బాయ్ గా పని చేసేవాడు, సాయంత్రం సమయాల్లో నదీ దగ్గరికి వెళ్ళి ఎగిరే పక్షులను బాగా పరిశీలించేవారు. బాగా చదువుకుని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి క్షిపణి శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతి గా భారత దేశానికి గొప్ప సేవలు అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు కూడా లభించింది. విద్యార్థులు గొప్ప కలలు కనాలి వాటి సాకారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించేవారు. కలాం గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
0 comments:
Post a Comment