ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి: ఈ రోజు ఉదయం 11గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్, పద్మావతి మేడం మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ గారు 1897 సంవత్సరంలో జనవరి 23న ఒరిస్సా రాష్ట్రంలో కటక్ పట్టణంలో జానకినాథ్ బోస్, ప్రభావతి లకు జన్మించారని, బాగా చదువుకుని 1920లో భారతీయ సివిల్ సర్వీసు లో 4వ ర్యాంకు సాధించి ఒక సంవత్సరం ఉన్నత ఉద్యోగం చేసి, బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టం లేక రాజీనామా చేసి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలకంగా కృషి చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ కు రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేసి సాయుధ పోరాటం ద్వారానే భారత స్వాతంత్ర్యం సాధ్యమని నమ్మి దానికి కూడా రాజినామా చేసి భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్ర్యం కోసం తన చివరి శ్వాస వరకు పోరాడారు అని వారి సేవలను విద్యార్థులకు వివరించడం జరిగింది. నేతాజీ గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
0 comments:
Post a Comment