బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులను జుట్లుగా చేసి కబడ్డీ, క్రికెట్, క్యారం బోర్డ్, తాడాట ఆటలు ఆడించడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ మాట్లాడుతూ ఆటలు ఆడటం ద్వారా విద్యార్థుల్లో శారీరక ఎదుగుదలతో పాటుగా మానసికంగాను ఆనందంగా, ఉత్సాహంగా ఉంటూ చురుకుదనం పొంపొందుతందన్నారు. అదేవిధంగా పోటీతత్వం, సమిష్టి బాధ్యత, నాయకత్వ లక్షణాలు, గెలుపు ఓటములను సమానంగా తీసుకునే క్రీడా స్పూర్తి, సమయ స్పూర్తి పెంపొందుతాయి. పాఠశాలలో వారికి ఇష్టమైన ఆటలు ఆడించడం వల్ల విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తారని, వారికి క్రమశిక్షణ అలవడుతుంది, చెడు విషయాలకు దూరంగా ఉంటారని అన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆటలు ఆడటం పిల్లల హక్కు అని ఆ సమయంలో వేరే పనులు చేయించొద్దన్నారు.
0 comments:
Post a Comment