జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం:
ఈ రోజు ఉదయం 11 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పునుంతల వైద్య సిబ్బంది విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్ లను వేశారు. వారు మాట్లాడుతూ 2015 లో పిల్లలలో నులిపురుగుల ప్రివలెన్స్ రేట్- 60% నుండి 2023 లో పిల్లలలో నులిపురుగుల ప్రివలెన్స్ రేట్-01% కు తగ్గిందని,
ఇంతటి ప్రగతి సాధించడం ఉపాధ్యాయుల సహాయ సహకారాల వల్లనే సాధ్యమైందన్నారు. అదేవిధంగా నులిపురుగుల నివారణ ఆవశ్యకత గురించి వివరిస్తూ పిల్లల్లో నులి పురుగులు ఉంటే వారు బలహీనంగా ఉండి వయస్సుకు తగిన విధంగా ఎదుగుదల ఉండదు అన్నారు. అందుకే విద్యార్థినీ విద్యార్థులు అందరూ నులిపురుగుల నుండి విముక్తి పొందడానికి ప్రతి ఒక్కరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలమణి, శ్రీనివాసులు, వెంకటేష్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉప్పునుంతల వైద్య సిబ్బంది దేవి, శ్రీనివాసులు, వీణ పాల్గొన్నారు.
0 comments:
Post a Comment