ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా డిజిటల్ తరగతుల దినోత్సవాన్ని ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొజెక్టర్ బిగ్ స్క్రీన్ పైన ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్ డిజిటల్ తరగతులు విద్యార్థులకు ఏవిధంగా ఉపయోగపడతాయో వివరిస్తూ నూతన పాఠ్యపుస్తకాలు అన్నింటిలోనూ ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన క్యూ.ఆర్ కోడ్ లను ముద్రించడం జరిగిందని, క్యూ.ఆర్ కోడ్లను ఉపయోగించి మొబైల్ లేదా ట్యాబ్ లేదా కంప్యూటర్ లేదా ప్రొజెక్టర్ లలో ఏ విధంగా ఆ పాఠ్యాంశాల డిజిటల్ వీడియో పాటలను చూడాలో తెలియజేశారు. ఈ డిజిటల్ పాఠాలను ఉన్నత విద్యావంతులు, సుదీర్ఘ అనుభవం కలిగిన విషయ నిపుణులు తయారు చేశారని, వీటిని విద్యార్థులకు చూపించడం ద్వారా పాఠాలను సులభంగా అవగాహన చేసుకుంటారని తెలియజేశారు. మెరుగైన ఫలితాలు సాధించడం కోసం విద్యారంగంలో, బోధనలో, మూల్యాంకనంలో కూడా సాంకేతికతను, డిజిటల్ పరికరాలను ఉపయోగించుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు బాలమణి మేడం, విద్యార్థులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment