ఈరోజు ఉదయం 9 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు బలమణి, శ్రీనివాసులు, వెంకటేష్ మాట్లాడుతూ యోగా గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015 సంవత్సరం నుండి జరుపుకుంటున్నారని తెలియజేశారు. యోగాసనాలు అంటే వ్యాయామంలో ఉండే వివిధ రకాల భంగిమలనే యోగాసనాలు అంటారని, ఇవి చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా తయారవుతామని, ఎలాంటి జబ్బులు దరిచేరావని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తామని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించబడి, అభ్యసన మెరుగుపడుతుందని, నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అందుకే ప్రతిరోజు విద్యార్థులతో 5 నిమిషాలు ప్రార్థనా సమయం ముందు యోగాసనాలు, ప్రార్థన అనంతరం ధ్యానం చేయించడం జరుగుతుందని తెలిపారు.
0 comments:
Post a Comment