Thursday, 13 June 2024

Samoohika Aksharabyasam at MPPS Uppununthala Boys| బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం


బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం:

ఈరోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలతో ఉపాధ్యాయులు,విద్యార్థులు నివాళులర్పించడం జరిగింది. పాఠశాలలో ఈ సంవత్సరం నూతనంగా చేరిన విద్యార్థుల పలకలపై అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ సార్, ఉపాధ్యాయులు బాలమణి మేడం, వెంకటేష్ సార్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు శారద, రజిత లు అక్షరాలు దిద్దించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మాట్లాడుతూ అక్షరాల ద్వారా, చదువు ద్వారానే మన జీవితాలు బాగుపడతాయి, మనం పొందిన జ్ఞానాన్ని ఎవ్వరు దొంగిలించలేరు. జ్ఞానవంతులకు సమాజంలో గౌరవం లభిస్తుంది, అదేవిధంగా మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చి ఉపాధ్యాయులు బోధించే విషయాలను శ్రద్ధగా విని, అవగాహన చేసుకుని వాటిని నేర్చుకొని బాగా చదువుకుంటూ భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

0 comments:

Post a Comment