బాలుర ప్రాథమిక పాఠశాలలో ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులు:
ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి అందరూ పూలతో నివాళులు అర్పించారు. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన లు మాట్లాడుతూ అంబేద్కర్ గారు చిన్నతనం నుండి ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురైనా బాగా చదువుకుని కుల, లింగ వివక్షతలకు, బాల్య వివాహాలు, జోగిని వ్యవస్థ, అంటరానితనం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారని, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని స్వాతంత్ర్యం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడారని, రాజ్యాంగం ద్వారా కులాలకు , మతాలకు అతీతంగా బాలబాలికలు అందరూ అభివృద్ధి సాధించడానికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ లు, అవకాశాలు, హక్కులు కల్పించారని వివరించారు. అంబేద్కర్ గారి స్పూర్తితో విద్యార్థులు బాగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చిత్ర లేఖనంలో ప్రతిభ కనబరిచిన లోకేష్, ప్రశాంత్, సైదులు, వరుణ్ తేజ్ లకు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలను బహుమతులుగా ఇచ్చి అభినందించడం జరిగింది.
0 comments:
Post a Comment