ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు!
ప్రభాత భేరిలో జాతీయ నాయకుల వేశాధారణలో విద్యార్థులు
ఉదయం 6 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 78 స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ప్రభాత భేరితో ప్రారంభం అయ్యాయి. విద్యార్థులు జాతీయ నాయకుల వేశాధారణ ధరించి వీధులన్నీ తిరుగుతూ భారతీయ వీరులం భరతమాత బిడ్డలం శాంతి కోరు పాపలం సమత పెంచు బాలలం అనీ పాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గొంతెత్తి నినదిస్తూ ఉప్పొంగిన ఆనందంతో దేశంపై గౌరవాన్ని చాటారు.
జాతీయ జెండా ఎగురవేస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ ఉదయం 8 గం.లకు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం, విద్యార్థులు జాతీయ గీతం ఆలపించి జెండా వందనం చేశారు. మహనీయులు మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు మొ.న వారి త్యాగాల ఫలితంగా ఈ స్వాతంత్ర్యం పొందినం. వారి ఆశయ సాధనకు విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప పౌరులుగా ఎదిగి దేశ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
నృత్య ప్రదర్శన చేస్తున్న విద్యార్థులు
అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు.
విజేతలకు బహుమతులు అందజేస్తున్న సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు
సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు ముఖ్య అతిథిగా హాజరై ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment