Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Friday, 20 June 2025

11th International Yoga Day Celebrations at MPPS Uppununthala Boys

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం: 

ఈ రోజు ఉదయం 10 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ యోగా ప్రత్యేకతను, ప్రయోజనాలను విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015 సంవత్సరం నుండి జరుపుకుంటున్నారని తెలియజేశారు. యోగాసనాలు అంటే వ్యాయామంలో ఉండే వివిధ రకాల భంగిమలనే యోగాసనాలు అంటారని, ఇవి చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా తయారవుతామని, ఎలాంటి జబ్బులు దరిచేరవని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తామని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించబడి, అభ్యసన మెరుగుపడుతుందని, నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అందుకే ప్రతిరోజు విద్యార్థులతో 5 నిమిషాలు ప్రార్థనా సమయం ముందు యోగాసనాలు, ప్రార్థన అనంతరం ధ్యానం చేయించడం జరుగుతుందని తెలిపారు.

Thursday, 19 June 2025

Sports Day Celebrations at MPPS Uppununthala Boys in the part of Pro Jayashankar Badi Bata programme

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు రోజు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహణ: 

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా క్రీడా దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఇందులో విద్యార్థులను జుట్లుగా చేసి కబడ్డీ, క్రికెట్, క్యారం బోర్డ్, తాడాట ఆటలు ఆడించడం జరిగింది. గెలుపొందిన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు , ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన సంగీత లు మాట్లాడుతూ ఆటలు ఆడటం ద్వారా విద్యార్థుల్లో శారీరక ఎదుగుదలతో పాటుగా మానసికంగాను ఆనందంగా, ఉత్సాహంగా ఉంటూ చురుకుదనం పొంపొందుతందన్నారు. అదేవిధంగా పోటీతత్వం, సమిష్టి బాధ్యత, నాయకత్వ లక్షణాలు, గెలుపు ఓటములను సమానంగా తీసుకునే క్రీడా స్పూర్తి, సమయ స్పూర్తి పెంపొందుతాయి. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో కూడా రాణిస్తారు  కాబట్టి పాఠశాలలో వారికి ఇష్టమైన ఆటలు ఆడించడం వల్ల విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా వస్తారని, వారికి క్రమశిక్షణ అలవడుతుంది, చెడు విషయాలకు దూరంగా ఉంటారని అన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆటలు ఆడటం పిల్లల హక్కు కాబట్టి వారిని ఆడుకోనివ్వాలన్నారు.



Wednesday, 18 June 2025

Awareness programme on AI based digital classes at MPPS Uppununthala Boys

ఏఐ ఆధారిత డిజిటల్ తరగతుల పైన అవగాహన:

 ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మధ్యాహ్నం 2 గం.లకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఏఐ ఆధారిత డిజిటల్ తరగతుల పైన అవగాహన కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ ట్యాబ్ ద్వారా ఏఐ ఆధారిత ఏ.ఎక్స్.ఎల్ వెబ్సైట్ లో విద్యార్థులు తమ యొక్క పెన్ నెంబర్ ను ఎంటర్ చేసి ఏ విధంగా లాగిన్ కావాలి, తెలుగు, ఇంగ్లీష్ మరియు గణితం లకు సంబంధించిన అసెస్మెంట్ ఎలా పూర్తి చేయాలి, అసెస్మెంట్ పూర్తి చేసిన అనంతరం విద్యార్థుల స్థాయిని ఈ ఏఐ నిర్ధారించి వారికి అనుగుణమైన అభ్యసన కృత్యాలను, వీడియో పాఠాలను అందజేస్తుందని, వీటిని పూర్తి చేయడం ద్వారా విద్యార్థులు అభ్యసనం లో ప్రగతి సాధిస్తారని వివరించడం జరిగింది. అదేవిధంగా జాలి ఫోనిక్స్ యాప్ ద్వారా విద్యార్థులు ఇంగ్లీష్ లో రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలి, నెంబర్ కిడ్స్, మ్యాత్ కిడ్స్, మ్యాత్ గేమ్స్ యాప్ ల ద్వారా గణిత భావనలు సంఖ్యలు, వాటిని పోల్చడం, కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం మొ.నవి ఎలా నేర్చుకోవాలి, పాఠ్య పుస్తకాలలో ఉన్న క్యూఆర్ కోడ్ ల ఆధారంగా డిజిటల్ తరగతులు ఎలా చూడాలి అనేది విద్యార్థులకు వివరించడం జరిగింది. సాంకేతికతను విద్యా రంగంలో, బోధనలో ఉపయోగించుకొని మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చందన, సంగీత లు విద్యార్థులకు తెలియజేశారు.


Monday, 16 June 2025

FLN Quiz has been conducted at MPPS Uppununthala Boys in the part of Pro Jayashankar Badi Bata programme 2025

విద్యార్థులకు ఎఫ్.ఎల్.ఎన్ క్విజ్ - విజేతలు బహుమతులు:

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో విద్యార్థులకు ఎఫ్.ఎల్.ఎన్ క్విజ్ నిర్వహించడం జరిగింది. ఈ క్విజ్ లో విద్యార్థులను ఐదు గ్రూపులుగా చేసి  తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల విజ్ఞానం మరియు జనరల్ నాలెడ్జ్ అంశాల నుంచి ప్రశ్నలు అడగడం జరిగింది. విద్యార్థులందరూ ఈ క్విజ్ లో చాలా ఆసక్తిగా, చురుకుగా పాల్గొని సమాధానాలు చెప్పారు. ఈ క్విజ్ లో ఎక్కువ పాయింట్లు సాధించిన గ్రూపు సభ్యులు యశ్వంత్, అశ్విని, భాను ప్రసాద్, అఖిల్, మనస్వి, శ్రవణ్ కుమార్ లకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పెన్నులు బహుమతులుగా అందజేసి అభినందనలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఈ క్విజ్ ల ద్వారా విద్యార్థుల్లో గెలవాలనే పోటీతత్వం, పట్టుదల, విషయ పరిజ్ఞానం, నేర్చుకోవాలనే ఆసక్తి, సమిష్టి కృషి మొదలైన లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. మిగతా విద్యార్థులు తర్వాత చేపట్టబోయే క్విజ్ లో విజయం సాధించేలా బాగా చదవాలని సూచించారు.

Friday, 13 June 2025

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాసం 2025

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో సామూహిక అక్షరాభ్యాసం:
ఈ రోజు ఉదయం 10 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఆద్వర్యంలో ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ అక్షరాలు అనేవి ఏ భాషకైనా ప్రాథమికమైనవని, అక్షరాలతో పదాలు, వాక్యాలు, పేరాలు తయారు అవుతాయని అందుకే విద్యార్థులకు అక్షరాలను, వాటి శబ్దాలను అర్థవంతమైన కృత్యాధార పద్దతిలో ఆట పాటలతో నేర్పిస్తున్నామని, చదవడం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని, రాయడం ద్వారా భావ వ్యక్తీకరణ చేయొచ్చని, విద్య మనిషిని మహోన్నతుడిని చేస్తుందన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, యువజన నాయకులు మేడమోని భాస్కర్, మాజీ యంపిటిసి పాత్కుల సైదమ్మ రామచంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలన్నారు. విద్యార్థులకు పలకలు అందించిన ఆలూరి శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు చెవ్వ పద్మ, విద్యార్థుల తల్లిదండ్రులు బాజ కోటేశు, మస్కూరి మల్లేష్, పాత్కుల కొండలు, సున్నం కుర్మయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.



Thursday, 12 June 2025

Welcoming students on reopening day in Grand PTM in the part of Pro Jayashankar Badi Bata programme 2025

పాఠశాల పునః ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు & విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ:

ఈ రోజు ఉదయం 9 గం.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో పాఠశాల పునః ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలను మామిడి తోరణాలతో అలంకరించడం జరిగింది, విద్యార్థులకు ఉపాధ్యాయులు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికి నూతన విద్యా సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో బడి ఈడు పిల్లలు అందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించడం గురించి చర్చించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ మన పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో అర్థవంతమైన కృత్యాధార భోధనతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరడం జరిగింది. అతిథులుగా హాజరైన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి గారు, సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వర్క్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని అందుకు నిదర్శనం 49 గురుకుల సీట్లు సాధించడమే అన్నారు. కాబట్టి గ్రామ ప్రజలు అందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 10 June 2025

Huge response for Door to door campaign for enrollment of school age children in our school MPPS Uppununthala Boys

ఉప్పునుంతలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఇంటింటి ప్రచారానికి భారీ స్పందన:

ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి ఆద్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, ఇప్పటివరకు 49 గురుకుల సీట్లు సాధించడం, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, వెంకటేష్ సార్ బాబు ఇదే పాఠశాలలో చదువుతుండటం, FLN విధానంలో ఎస్సీఈఆర్టీ వారు రూపొందించిన పాఠ్య ప్రణాళికల ఆధారంగా బోధనోపకరణాలతో ఐదు రోజులు అర్థవంతమైన బోధన, ఒక రోజు మదింపు, ప్రతి రోజూ వర్క్ బుక్ అభ్యాసం, అభ్యసనంలో వెనుకబడిన విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ, కృత్రిమ మేధా ఆధారంగా విద్యాబోధన, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల, క్విజ్, స్పెల్ బీ కాంపిటీషన్స్, నో బ్యాగ్ డే, ప్రతి నెల ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశాలు, ప్రత్యేక దినోత్సవాల నిర్వహణ, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది. కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరడం జరిగింది. ఈ రోజు 20 మంది విద్యార్థులతో ఇప్పటి వరకు మొత్తం 80 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకువచ్చారు. ఈ ప్రచారంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Monday, 9 June 2025

Door to door campaign for enrollment of school age children in the part of Badi Bata programme 2025-26

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఇంటింటి ప్రచారం: అన్ని ప్రభుత్వ బడిలో ఉండగా-ప్రైవేటు బడికి ఎందుకు దండుగా

ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ ఆలూరి అరుణలింగమయ్య గారి ఆద్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, భోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన, FLN విధానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం, కృత్రిమ మేధా ఆధారంగా విద్యాబోధన, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరడం జరిగింది. ఈ రోజు 25 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం జరిగింది. ఈ ప్రచారంలో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Pro Jayashankar Badi bata programme at fields 2025 for enrollment of school age children

పంట పొలాలకి వెళ్ళి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్:

ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, భోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన, FLN విధానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఏఐ ఆధారంగా విద్యాబోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది కాబట్టి మీ పిల్లలు అందరినీ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం జరిగింది. ఈ రోజు 15 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం జరిగింది.అనంతరం గాజుల వెంకటేష్ సమీప పంట పొలాలకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న తల్లిదండ్రులతో మాట్లాడి మా బాబు రాహుల్ ఈ బడిలోనే చదువుతున్నాడని, మీ పిల్లలను కూడా మన బడిలో చేర్పించాలని కోరడం జరిగింది.ఉపాధ్యాయులు చందన, సంగీత, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.



Saturday, 7 June 2025

Door to Door survey in the part of Pro Jayashankar Badi Bata programme at Uppununthala

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఆద్వర్యంలో బడి బాట కార్యక్రమం: 20 మంది విద్యార్థులు చేరిక
ఈరోజు ఉదయం 8 గం.లకు ఉప్పునుంతల మండల కేంద్రంలో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు గారి ఆద్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేయడం జరిగింది. పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, 5వ తరగతి గురుకుల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, భోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన, FLN విధానంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం, కృత్రిమ మేధా ఆధారంగా విద్యాబోధన, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం అందించడం జరుగుతుంది కాబట్టి బడి ఈడు పిల్లలు అందరూ మన ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం జరిగింది. ఈ రోజు 20 మంది విద్యార్థులు పాఠశాలలో చేరడం జరిగింది. ఈ సర్వే లో ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Friday, 6 June 2025

Grama Sabha at Uppununthala on the occasion of Pro Jayashankar Badi Bata programme







ఈ రోజు ఉదయం 9 గం.లకు ఉప్పునుంతల మండలం కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి నారుమోళ్ళ వెంకటేష్ గారి ఆద్వర్యంలో గ్రామ సభ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించడం, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, ప్రతి సంవత్సరం విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలను గ్రామ ప్రజలకు ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉప్పునుంతల రాజస్వ ప్రధానోపాధ్యాయులు& కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి సార్ వివరిస్తూ గత విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో మన పాఠశాల నుంచి 563 మార్కులతో ఎ.నందిని మండలంలో మొదటి ర్యాంకు సాధించిందని, 25 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించారని, 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఇంటరాక్టివ్ డిజిటల్ ప్యానల్ లు, సుదీర్ఘ అనుభవం కలిగిన, విషయ నిపుణులు అయిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలియజేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్ లు, 2 జతల ఏకరూప దుస్తులు, రుచికరమైన మధ్యాహ్నం భోజనం అందిస్తుందన్నారు. బాలికల ప్రాథమిక పాఠశాల ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయులు బిచ్యా నాయక్ సార్, బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు సార్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు భోధనోపకరణాలతో, కంప్యూటర్, ప్రొజెక్టర్, ట్యాబ్ , కృత్రిమ మేధాలతో అర్థవంతమైన కృత్యాధార భోధన చేస్తున్నామని, కంప్యూటర్ విద్యను, స్పోకెన్ ఇంగ్లీష్, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో ప్రతి సంవత్సరం గురుకుల సీట్లు సాధిస్తున్నారని తెలియజేశారు. బడి ఈడు పిల్లలు అందరినీ మన ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ గారు హాజరైన వారందరితో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తమ వంతు కృషి చేస్తామని బడిబాట ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, యువకులు ఆలూరి వెంకటేష్ లు మాట్లాడుతూ మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేస్తున్నారని విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం అన్నారు. పంచాయతీ కార్యదర్శి పాఠశాలల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వక్తి గత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. మూడు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Wednesday, 4 June 2025

Felicitation on Selection of Best Practices School MPPS Uppununthala Boys

బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఎంపిక: ప్రధానోపాధ్యాయులు మరియు సీనియర్ ఉపాధ్యాయుల కు సన్మానం 

 తెలంగాణ ఎస్సీఈఆర్టీ వారు బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలల ఎంపిక కోసం గత నెలలో ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా నుంచి మొత్తం 78 పాఠశాలల వారు దరఖాస్తు చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో గారి నేతృత్వంలోని కమిటీ 3 పాఠశాలలోను బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా ఎంపిక చేసి ఎస్సీఈఆర్టీ వారికి పంపించడం జరుగింది. అందులో బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల ఎంపిక కావడం జరిగింది.

ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో బోధనోపకరణాలతో కృత్యాధార పద్దతిలో, ఐసిటీ తో అర్థవంతమైన బోధన చేయడం, గురుకుల పాఠశాలల ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, డిజిటల్ తరగతులు వంటి వినూత్న పద్ధతుల్లో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అహ్లాదకరమైన వాతావరణంలో ఆటపాటలతో చదువును అందించడంతో ఈ సంవత్సరం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించారు, గత ఏడు సంవత్సరాల్లో మొత్తం 49 మంది ఈ పాఠశాల నుంచి గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల కృషిని తెలుసుకుని దాతలు ప్రొజెక్టర్, కలర్ ప్రింటర్, కంప్యూటర్ లు, స్టడీ మెటీరియల్, స్కూల్ బ్యాగ్ లు మొదలైనవి అందించడం జరుగుతుంది. ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ తన పిల్లలను ఇదే పాఠశాలలో చదివించడం. ఇవన్నీ గమనించి తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చేర్పిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యను గత ఏడు సంవత్సరాల్లో 20 నుంచి 73 కి పెంచడం జరిగింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ పాఠశాలను బెస్ట్ ప్రాక్టీసెస్ పాఠశాలగా ఎంపిక చేశారు. ఈ పాఠశాల నుంచి ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ రేపు హైదరాబాద్ లో జరిగే ఎం.ఇ.వో ల సమావేశంలో పాఠశాల అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి చేస్తున్న ఉపాధ్యాయుల కృషిని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారు, అకాడమిక్ మానిటరింగ్ అధికారి షఫ్రోద్దీన్ గారు, మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్ గారు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి గారు, మండల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు మరియు సీనియర్ ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ లను విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు శాలువాలతో సన్మానించి అభినందించారు.

12th state formation day of Telangana celebrations at MPPS Uppununthala Boys

 బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం:

ఈరోజు జూన్ 2న ఉదయం 8:45 ని.లకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో 12వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. శ్రీనివాసులు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నిధులు, నీళ్ళు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాలను తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలందరికీ వివరిస్తూ సకల జనులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేదావులు, కవులు, కళాకారులు, రచయితలు, రైతులు, అన్ని రాజకీయ పార్టీలను, నాయకులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారు. శ్రీకాంత చారి లాంటి ఎందరో అమరవీరులు ప్రాణ త్యాగాలు చేసిన అనంతరం తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 న ఏర్పాటు కావడం జరిగింది. 12 సం.రాల స్వరాష్ట్రంలో మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు.