Students as National Leaders

Students play as national leaders and freedom fighters on Republic day .

Digital Classes on Projector big screen

Students watch digital lessons on the big screen by scanning QR Code given on the text book.

Students read books and enjoy at the Library

Students read moral stories and enjoy. Develop reading skills and as well as get moral values .

Students play games for health

Students play games for physical and mental health as well as get happiness .

Health check up by Govt Medical Staff

Monthly health check up is done by Govt medical staff and give medicines if needed to the students.

Tuesday, 6 August 2024

Farewell and Welcome Programme at MPPS Uppununthala Boys

 

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు & స్వాగతం కార్యక్రమం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఆత్మీయ వీడ్కోలు & స్వాగతం కార్యక్రమాన్ని హెచ్.ఎం శ్రీనివాసులు సార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా కాంప్లెక్స్ హెచ్.ఎం శ్రీనివాస్ రెడ్డి సార్, పెద్దలు కట్ట అనంత రెడ్డి సార్, పి.ఆర్.టి.యు రాష్ట్ర నాయకులు బిచ్యా నాయక్ సార్, ఎ.ఎ.పి.సి చైర్ పర్సన్ అరుణ లింగమయ్య గారు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేసి పదోన్నతిపై వెళ్లిన ప్రధానోపాధ్యాయురాలు  బాలమణి మేడంను శాలువ, పూలదండతో అతిథులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడుతూ నాణ్యమైన విద్య అందించి ప్రతి సంవత్సరము గురుకుల సీట్లు వచ్చేలా కృషి చేసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 20 నుంచి 85 కి పెంచారని వివరించారు. అదేవిధంగా బదిలీ పైన పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలు చందన మేడంను శాలువ, పూలదండతో సన్మానించి సాదరంగా స్వాగతం పలికి నాణ్యమైన విద్య అందించాలని కోరారు. సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాసులు గారు, జెర్మయ్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నాగరాజు గారు, ఆర్.కృష్ణ గారు, రతన్ సింగ్ గారు తదితరులు పాల్గొన్నారు.

Saturday, 3 August 2024

Spelling Bee Competition at MPPS Uppununthala Boys

 

స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహణ:

ఈ రోజు మధ్యాహ్నం 3 గం.కు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో మొదటి శనివారం సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్ భాషపై అవగాహన పెంపొందించడానికి విద్యార్థులను ఐదు గ్రూపు లుగా చేసి వారికి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రతిభ కనబరిచిన ఎదురిశెట్టి వరున్ తేజ్ గ్రూప్ విద్యార్థులు మొదటి బహుమతి మరియు ఆలూరి అక్షర గ్రూప్ విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందారు, వీరికి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ సార్ ఉపాధ్యాయులు వెంకటేష్ సార్, చందన మేడం అభినందనలు తెలియజేసి, పెన్నులు బహుమతిగా ఇవ్వడం జరిగింది. మిగతా గ్రూపు విద్యార్థులు నిరాశ చెందకుండా తరువాత జరగబోయే కాంపిటీషన్ లో విజయం సాధించేలా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ వల్ల విద్యార్థుల్లో ఇంగ్లీష్ పదజాలం అభివృద్ధి చెంది భాషపై అవగాహన పెరుగుతుంది అన్నారు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకుని రాణించాలంటే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించి భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Saturday, 20 July 2024

Parent Teacher Meeting has been conducted at MPPS Uppununthala Boys

 
తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహణ:

ఈరోజు ఉదయం 9:30 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. 

ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ లు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ సమావేశం ఉంటుందని, పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం గురించి తెలియజేస్తూ సహ పాఠ్య కార్యక్రమాలు, పాఠశాల నిర్వహణ, అభివృద్ధి సంబంధించిన పనులలో, మీ వృత్తికి సంబంధించిన విషయాలపై పిల్లలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించడంలో విద్యార్థుల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు.

అదేవిధంగా ఇంటి వద్ద విద్యార్థులు చదువుకోవడానికి అనువైన గాలి వెలుతురు వచ్చేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయాలని, టీవీ, మొబైల్ వంటి శబ్దాలు రాకుండా చూడాలని, అక్కడ వారు చదువుకోవడానికి, ఇంటి పని పూర్తి చేయడానికి ప్రోత్సహించాలని వివరించారు. విద్యార్థులు నేర్చుకున్న సామర్థ్యాల సాధన కోసం ఇంటింటా చదువుల పంట యాప్ ని ఉపయోగించాలన్నారు. పాఠశాల అవసరాలను తెలియజేశారు. తల్లిదండ్రులు వారి పిల్లల ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు, ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.

ఈ సమావేశంలో గ్రామ పెద్దలు పాత్కుల రామచంద్రయ్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆలూరి లింగమయ్య, బొల్లె పర్వతాలు, ఆలూరి తిరుపతయ్య, సున్నం కురుమయ్య,మల్లయ్య, సునిత, శారద, శిరీష, లలిత, కల్పన, యాదమ్మ, వెంకటమ్మ, చంద్రకళ, శ్రీలత, అనిత, సైదమ్మ, శైలజ, రాధ, బాలమ్మ, విజయ, బి.అనిత, సుహాసిని, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

Thursday, 18 July 2024

Navodaya Classes Start at MPPS Uppununthala Boys

 

బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో నవోదయ తరగతులు ప్రారంభం:

నవోదయ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యిందని, పరీక్ష జనవరి 18, 2025 న నిర్వహిస్తారని, ప్రస్తుతం విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 16వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, నవోదయ తరగతులు ఈ రోజు నుండి మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రారంభించడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం తెలియజేశారు. అదేవిధంగా మన పాఠశాలలో సైనిక్ పాఠశాలల్లో, గురకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు బట్టి విధానంలో కాకుండా బోధనోపకరణాలతో అర్థవంతమైన కృత్యాధార బోధన చేస్తున్నామని, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని, విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వం కోసం అహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడి లేకుండా నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని, బాలురకు హాస్టల్ వసతి ఉన్నందున ఈ గ్రామం విద్యార్థులతో పాటు, పరిసర గ్రామాల విద్యార్థులు మన పాఠశాలలో ప్రవేశం పొంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, వెంకటేష్ సార్ తెలియజేశారు.

Friday, 12 July 2024

Teacher's Farewell and Welcome Programme at MPPS Uppununthala Boys

 

ఘనంగా ఆత్మీయ వీడ్కోలు మరియు స్వాగతం కార్యక్రమం:

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ఆత్మీయ వీడ్కోలు మరియు స్వాగతం కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు బాలమణి మేడం అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల సముదాయం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్, గ్రామ పెద్దలు కట్ట అనంత రెడ్డి సార్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ అరుణ గారు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి మరియు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేసి బదిలీ పైన వెళ్లిన ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ సార్ ను, ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, పద్మావతి మేడం లను శాలువాలతో, పూల దండలతో అతిథులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ సార్, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడుతూ నాణ్యమైన విద్య అందించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 20 నుంచి 81 కి పెంచడం జరిగిందని వివరించారు. అదేవిధంగా వారి స్థానంలో బదిలీ పైన పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు శ్రీనివాసులు సార్, ఉపాధ్యాయురాలు చందన మేడం లను శాలువాలతో, పూల దండలతో సన్మానించి సాదరంగా స్వాగతం పలికారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు గారు, గ్రామ పెద్దలు పాత్కుల రామచంద్రయ్య గారు, డి.టి.ఎఫ్ నాయకులు రామస్వామి సార్, సమీప పాఠశాలల ఉపాధ్యాయులు జానకి రాములు సార్, శ్రీనివాసులు సార్, విద్యార్థుల తల్లిదండ్రులు బొల్లె పర్వతాలు, ఆలూరి వెంకటేష్, కాలూరి భారతి, భాజ అనిత, ఆలూరి సుహాసిని, మధనాగుల కవిత మరియు విద్యార్థులు పాల్గొని సన్మానించారు.

Saturday, 22 June 2024

School bags distributes by Mr. Maryada Rukma Reddy to MPPS Uppununthala Boys

 
విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ!

ఈ రోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల విద్యార్థులకు ఇదే పాఠశాలలో చదివి అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి మర్యాద రుక్మా రెడ్డి గారు, తన సోదరుడు మర్యాద కృష్ణ రెడ్డి గారితో స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేయించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ, ఉపాధ్యాయులు బాలమణి, వెంకటేష్ మాట్లాడుతూ పాఠశాల సాధించిన ప్రగతిని, విద్యార్థులు సాధించిన గురుకుల సీట్ల వివరాలను, పాఠశాలలో చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విద్య, చిల్డ్రన్ బ్యాంకు, గురుకుల, నవోదయ ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక తరగతులు, టి.ఎల్.ఎం తో కృత్యాధార అర్థవంతమైన బోధన వివరాలను తెలియజేసి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ రెడ్డి గారు విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ మేము కూడా ఇదే పాఠశాలలో చదువుకొని గొప్ప స్థాయికి చేరుకొన్నామని, పాఠ్యపుస్తకాలను భద్రపరచుకోవడాని ఉపయోగపడే స్కూల్ బ్యాగ్ లను పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా ఇవ్వడం సంతోషంగా ఉందని, మీరు బాగా చదువుకుని భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. పేరెంట్ రాంచంద్రయ్య , బాలికల పాఠశాల ఉప్పునుంతల హెచ్.ఎం నరసింహ రెడ్డి పాల్గొన్నారు.

Thursday, 20 June 2024

International Yoga Day Celebrations 2024 at MPPS Uppununthala Boys


ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం: 

ఈరోజు ఉదయం 9 గంటలకు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు బలమణి, శ్రీనివాసులు, వెంకటేష్ మాట్లాడుతూ యోగా గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పగటి సమయం ఎక్కువగా ఉండే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2015 సంవత్సరం నుండి జరుపుకుంటున్నారని తెలియజేశారు. యోగాసనాలు అంటే వ్యాయామంలో ఉండే వివిధ రకాల భంగిమలనే యోగాసనాలు అంటారని, ఇవి చేయడం ద్వారా శారీరకంగా దృఢంగా తయారవుతామని, ఎలాంటి జబ్బులు దరిచేరావని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తామని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఏకాగ్రత పెంపొందించబడి, అభ్యసన మెరుగుపడుతుందని, నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు. అందుకే ప్రతిరోజు విద్యార్థులతో 5 నిమిషాలు ప్రార్థనా సమయం ముందు యోగాసనాలు, ప్రార్థన అనంతరం ధ్యానం చేయించడం జరుగుతుందని తెలిపారు.