Friday, 14 November 2025

PTM and National Children's Day 2025 celebrations at MPPS Uppununthala Boys

ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం & బాల దినోత్సవం: 

ఈరోజు బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీతలు మాట్లాడుతూ పిల్లలంటే అమితమైన ఇష్టం కలిగిన మన దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఆయన పిల్లలే దేశ భవిష్యత్తు అని పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి సాధించబడుతుందని వారికోసం ఎన్నో విద్యాలయాలు ఏర్పాటు చేశారని తెలియజేశారు.

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ ,వర్కు పుస్తకాలు, కృత్రిమ మేదతో డిజిటల్ తరగతులు మొ.న అంశాలను వివరించారు .

అనంతరం ఆనందకరమైన బాల్యాన్ని అందించడం అనే అంశం పైన చర్చించడం జరిగింది. పిల్లలకు చదువుతోపాటు ఆటలు, పాటలు, నైతిక విలువలు అందించే కథలు అంటే చాలా ఇష్టం. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి స్వేచ్ఛపూరిత వాతావరణంలో, భయం లేకుండా ఆనందకరమైన బాల్యాన్ని గడిపిన పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ఉత్తమ పౌరులుగా తమ బాధ్యతను నిర్వహిస్తారు కాబట్టి వారి బాల్యాన్ని ఆనందకరంగా తీర్చిదిద్ది వారికి భరోసానిస్తూ వారు సంపూర్ణ మూర్తిమత్వ వికాసం పొందే లాగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమాజం కృషి చేయాలని సూచించారు. చాచా నెహ్రూ గారి జీవితాన్ని పూర్తిగా తీసుకొని విద్యార్థులు భవిష్యత్తు లో గొప్ప స్థాయికి చేరుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. 



అనంతరం కేక్ కోసీ విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో సింగిల్ విండో డైరెక్టర్ ఆలూరి శ్రీనివాసులు, ఏఏపిసీ చైర్ పర్సన్ ఆలూరి అరుణ గారు , విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు

0 comments:

Post a Comment