మన బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల కు డ్యుయల్ డెస్క్ లు వితరణ:
బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతలకు బహుజన ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు టీచర్ విజయ్ కుమార్ గారు రూ. 30 వేల విలువైన డ్యుయల్ డెస్క్ లు అందించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఈ డ్యుయల్ డెస్క్ లు సౌకర్యవంతంగా కూర్చోవడానికి ఎంతో ఉపయోగపడుతాయని, తద్వారా విద్యార్థులు పాఠాలను ఆసక్తిగా, శ్రద్ధగా విని నేర్చుకుంటారని అన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే డ్యుయల్ డెస్క్ లు అందించిన విజయ్ కుమార్ గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్, చందన, సంగీత లు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేసి వారిని శాలువాతో సన్మానించారు.
డ్యుయల్ డెస్క్ లు అందించిన విజయ్ కుమార్ సార్ కి సన్మానం









0 comments:
Post a Comment